Pushpa : వామ్మో.. పుష్ప మూవీని ఇంత మంది మిస్ చేసుకున్నారా..? ముందు అనుకున్న న‌టులు మొత్తం మారిపోయారు..

Pushpa : ఏ రచయిత, దర్శకుడైనా గానీ ఒక హీరోని తన దృష్టిలో పెట్టుకుని కథను మలచుకోవడం అనేది సర్వసాధారణం. ఈ హీరో అయితే ఈ చిత్రానికి సరిపోతాడు అనుకుంటూ ఊహించుకుంటూ కథని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్న వాటికి భిన్నంగా ఒక్కోసారి కథలో మార్పులు చేర్పులు చేయడం అనేవి సర్వసాధారణం. ఈ సమయాల్లో వారు ఊహించుకున్న స్టార్ హీరోకు బదులుగా మరొక హీరోని పెట్టి చిత్రాలను తీయవలసి వస్తోంది. అసలు విషయానికొస్తే.. డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

సుకుమార్ పుష్ప చిత్రానికి మొదటగా మహేష్ బాబు హీరోగా అనుకొని కథను మలుచుకోవడం జరిగిందట. అంతే కాకుండా మహేష్ బాబుకి పుష్ప చిత్ర కథను వినిపించడం కూడా జరిగింది. మహేష్ బాబుకు కథ నచ్చకపోవడంతో నేను ఇలాంటి మాస్ క్యారెక్టర్ కు సెట్ కానని వెంటనే నో చెప్పేశారట. ఈ చిత్రం కాస్త అల్లు అర్జున్ ని వరించింది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుని సక్సెస్‌ను అందుకున్నాడు.

Pushpa

అదే విధంగా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం రంగస్థలం. రంగస్థలం చిత్రంలో రామలక్ష్మి పాత్రలో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో సుకుమార్ పుష్ప చిత్రంలో శ్రీవల్లి పాత్రకు మొదట సమంత అని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల సమంత పుష్ప చిత్రాన్ని రిజక్ట్ చేయడంతో ఆ లక్కీ చాన్స్ కాస్తా రష్మికను వరించింది. సమంత మాత్రం ఊ అంటావా మామ.. ఉహూ ఉంటావా మామ అనే స్పెషల్ సాంగ్ లో చాన్స్ దక్కించుకుని దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది.

ఈ పాటతో ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది సమంత. ఈ పాటకు కూడా మొదట్లో దర్శకుడు సుకుమార్ బాలీవుడ్ ముద్దుగుమ్మలైన‌ నోరా ఫతేహి, దిశా పటానిల‌ను అనుకున్నారట. వీరు ఈ పాటలో నటించడానికి భారీగా డిమాండ్ చేయడంతో ఆ ఛాన్స్ ను సమంత కొట్టేసింది. పుష్ప చిత్రంలో చివరగా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు కూడా మొదటిగా విజయ్ సేతుపతిని అనుకున్నారు. విజయ్ సేతుపతి డేట్స్ సెట్ కాకపోవడంతో ఈ పాత్ర కాస్తా ఫహద్ ఫాసిల్ ని వరించింది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను వదులుకొని మంచి బ్లాక్ బస్టర్ ని తమ చేతులారా పోగొట్టుకున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM