ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే షాక‌వుతారు..!

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిత్రం ఛ‌త్రపతి. ఈ చిత్రంతో ప్రభాస్ మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది. ఈ చిత్రంలో దర్శకుడు రాజమౌళి పండించిన మదర్ సెంటిమెంట్ ఎంతో హైలెట్ గా నిలిచింది. ఛ‌త్రపతి చిత్రం ద్వారా అందులో నటించిన ఆర్టిస్టుల‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సూపర్ హిట్ ని అందుకుంది. ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఈ చిత్రంలో శ్రియ శరన్ నటించింది. ప్రదీప్ రావత్, భానుప్రియ, షఫీ, కోట శ్రీనివాసరావు, వేణుమాధవ్, సుప్రీత్ రెడ్డి వంటి యాక్ట‌ర్లు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో అదరహో అనిపించారు.

ఇక ఈ చిత్రంలో సూరీడు అనే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఛ‌త్రపతి చిత్రంలో కథ మలుపు తిరగడానికి కారణం సూరీడు. సూరీడు కాట్ రాజ్ అనే ఒక రౌడీ దగ్గర కాళ్లు నొక్కకే పని చేస్తాడు. సూరీడు మేన మామ ఆచూకీ తెలియడంతో తల్లితో స‌హా ఊరికి వెళ్లడానికి ఎంతో ఆనందంగా సిద్ధమవుతాడు. అదే టైంలో కాట్ రాజ్ అక్కడకు వచ్చి ఎక్కడికి రా బయలుదేరుతున్నావ్, వచ్చి బండెక్కు అంటాడు. అమ్మని మామ దగ్గర వదిలి వస్తాను అన్న అంటూ కాట్ రాజ్ మాట పట్టించుకోకుండా తల్లిని తీసుకువెళ్లడానికి బయలుదేరితే, కాట్ రాజ్ కోపంతో ఇనుప రాడ్డుతో సూరీడు తలపై కొడతాడు. అక్కడి నుంచి చిత్ర కథ మలుపు తిరుగుతుంది.

ఇక సూరీడుగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు భాస్వంత్. ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరూ గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. ఛ‌త్రపతిలో సూరీడుకి అనితా చౌదరి తల్లిగా నటించింది. ఈ కుర్రవాడు ఇప్పుడు అనితా చౌదరితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అతను చూస్తే హీరో మాదిరిగా ఉన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇతడు తిరిగి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతారా లేదా హీరోగా కెరియర్ మొదలు పెడతాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM