RRR Movie Malli : ఆర్ఆర్ఆర్ సినిమాలో మ‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఆ బాలిక ఎవ‌రో తెలుసా ?

RRR Movie Malli : రాజ‌మౌళి తెర‌కెక్కించిన మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం.. ఆర్ఆర్ఆర్ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా ఇప్ప‌టికే రూ.500 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసి రికార్డుల వేట‌ను కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. భాష‌ల‌తో సంబంధం లేకుండా అన్ని వ‌ర్గాల‌కు చెందిన ప్రేక్ష‌కులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీలో న‌టించిన మ‌ల్లి అనే పాత్ర గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈమెది సినిమాలో చాలా కీల‌క‌పాత్ర‌. సినిమా స్టోరీలో 70 శాతం ఈమె చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ మ‌ల్లి ఎవ‌రు ? ఆమె అసు పేరు ఏమిటి ? ఎక్క‌డ ఉంటుంది ? ఏం చేస్తుంది ? త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

RRR Movie Malli

ఆర్ఆర్ఆర్ సినిమాలో చ‌ర‌ణ్, ఎన్‌టీఆర్ పాత్ర‌లు మాత్ర‌మే కాకుండా మ‌ల్లి పాత్ర‌లో న‌టించిన బాల న‌టికి కూడా మంచి పేరే వ‌చ్చింది. అస‌లు సినిమా మొద‌లు కావ‌డ‌మే ఈమె పాత్ర‌తో మొద‌ల‌వుతుంది. బ్రిటిష్ దొర‌సాని మ‌ల్లిని త‌న‌తో తీసుకుపోతుంది. దీంతో మ‌ల్లిని ర‌క్షించేందుకు భీమ్ ఢిల్లీకి వెళ్తాడు. అక్క‌డ రామ‌రాజుతో క‌లిసి ఎట్ట‌కేల‌కు మ‌ల్లిని ర‌క్షిస్తాడు. కానీ క‌థ అక్క‌డే మ‌లుపు తిరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. భీమ్‌, రామ‌రాజుల పాత్ర‌ల‌ను క‌లిపేది మ‌ల్లి పాత్రనే. ఇక మ‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఆమె అస‌లు పేరు.. ట్వింకిల్ శర్మ. ఈమెది చండీగఢ్‌.

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన‌ప్పుడు ట్వింకిల్ శ‌ర్మ 8వ త‌ర‌గ‌తి చ‌దుతుండేది. కానీ ఇప్పుడు 10వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఈమె హిందీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఎన్నో టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన యాడ్స్‌లోనూ న‌టించింది. సోష‌ల్ మీడియాలో కూడా ట్వింకిల్ శ‌ర్మ యాక్టివ్‌గానే ఉంటుంది.

ఈమెను ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌ట‌న‌లో చూసిన రాజ‌మౌళి ఆడిష‌న్‌కు హైద‌రాబాద్‌కు ర‌మ్మ‌న్నారు. చండీగ‌ఢ్ నుంచి హైద‌రాబాద్‌కు విమాన టిక్కెట్ల‌ను కూడా రాజ‌మౌళి బుక్ చేయించారు. ఇక ట్వింకిల్‌కి తమిళ భాషలో స్క్రిప్ట్‌ను అందించారు. ఆ భాషలోనే ఆడిషన్ చేయించారు. అందుకు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను రాజ‌మౌళి నియ‌మించారు. దీంతో తమిళ భాషలోనే ఆడిషన్ చేశారు. ఇక ఆడిష‌న్‌లో ఆమె నటనకి రాజ‌మౌళి ఆశ్చ‌ర్యపోయారు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీలో మల్లి పాత్రకి ఆమెని రాజ‌మౌళి ఫిక్స్‌ చేశారు. ఇక మ‌ల్లి పాత్ర కోసం ఏకంగా 160 మందిని ఆడిషన్ చేశారు. చివరికి మల్లి పాత్ర ట్వింకిల్‌‌ని వరించింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో ఆమె నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. మ‌ల్లి యాక్టింగ్ చాలా బాగుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM