Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మొదట్లో టీడీపీలో ఉండేది. తరువాత వైసీపీలోకి వచ్చింది. ఆ తరువాత ఎమ్మెల్యే అయి ఇప్పుడు మంత్రిగా హోదాను అనుభవిస్తున్నారు. అలాగే మంత్రి అవకముందు వరకు ఈమె జబర్దస్త్ షోలో జడ్జిగా చేశారు. పలు ఇతర షోలలోనూ హోస్ట్‌గా చేశారు. ఇక రోజా భర్త సెల్వమణి అన్న విషయం తెలిసిందే. ఈయన ప్రముఖ దర్శకుడు. కానీ ఇప్పుడు సినిమాలు ఏవీ చేయడం లేదు. ఈమెకు కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలిక ఉన్నారు. వీరిద్దరూ చదువుల్లో రాణిస్తున్నారు.
కాగా మంత్రి రోజాకు భారీగా ఆస్తులు ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ ఆమెకు ఉన్న ఆస్తులు తక్కువే. ఈ మధ్యే ఆమె ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నారు. దాని విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. దీంతో రోజా ఆస్తుల విషయం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే రోజాకు అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి.. అని అందరూ ఆరాలు తీస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఆమె ఎన్నికల సంఘానికి అందజేసిన అఫిడవిట్‌లో మాత్రం తన ఆస్తుల విలువ రూ.7.38 కోట్లు అని తెలియజేశారు.
రోజా తన ఆస్తి విలువ రూ.7.38 కోట్లు ఉంటుందని అప్పట్లో అఫిడవిట్‌లో చెప్పారు. అది ఇప్పటికి మూడేళ్లు అయిపోయింది కనుక ఆమె ఆస్తులు ఇంకాస్త పెరిగి ఉంటాయని సమాచారం. ఇక అప్పటి ప్రకారం అయితే ఆ ఆస్తి విలువలో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండగా, చరాస్తులు రూ.2.74 కోట్ల వరకు ఉన్నాయి. ఆమెకు రూ.49 లక్షల అప్పు ఉన్నట్లు చెప్పారు.
రోజా కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలికల పేరిట బ్యాంకుల్లో చెరో రూ.50 లక్షల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రోజాకు రూ.1 కోటి విలువ చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా స్కార్పియోలతోపాటు ఇంకో ఫోర్డ్ కారు కూడా ఉంది. ఇక ఆమె భర్త సెల్వమణికి స్థిరాస్తులు ఏమీ లేవని చెప్పారు. అప్పు రూ.22 లక్షలు ఉండగా.. ఆయనకు రూ.58 లక్షల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వివరాలను ఆమె అప్పట్లో అఫిడవిట్‌లో చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఆస్తి రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…