రూ.1000 సంపాదిస్తే కాలర్ ఎగరేస్తాం. పది మంది కూడా వస్తే మన అంత గొప్ప లీడర్ లేడని ఫీల్ అయిపోతాం. ఒక సక్సెస్ వస్తే.. కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టి.. కళ్ళు నెత్తి మీద పెడతాం. అదే ఫెయిల్యూర్ వస్తే కళ్ల నుండి కన్నీళ్లకి ఆనకట్టలు తెంపేస్తాం. ఒకడు సాయం చేస్తాను అంటే ఎదురు చూస్తాం. ఒకడికి సాయం చేయాలంటే దూరంగా ఉంటాం. అలాంటిది ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా.. ఎన్ని విజయాలు చూసినా, మరెన్ని పరాజయాలు పలకరించినా. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో.. చెక్కు చెదరని గుండె ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు జనసేనాని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంటూ అభిమానుల అభినందనలు, బర్త్ డే విషెస్ లతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.
పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే.. టీజర్ వచ్చినప్పటి నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు ఫ్యాన్స్.. ఇంకా ఆయన పుట్టిన రోజుకైతే.. 100 రోజుల ముందు నుంచే కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈ ఏడాది ఆ ఇంటెన్స్ ఇంకా పెరిగింది. జల్సా, తమ్ముడు రీ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మోస్ట్ పాపులర్ హీరో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో చిత్రానికి రూ.50 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన పవర్ స్టార్ ఆస్తుల విలువ ఎవరూ ఊహించలేనంత ఉండాలి. కానీ ఇతర స్టార్ హీరోలకు ఉన్నత రేంజ్ ల్ పవన్ కళ్యాణ్ ఆస్తులు లేవని సమాచారం. పవన్ పొలిటికల్ గా జనసేన పార్టీని నడుపుతున్నారు. పార్టీ భారం కూడా ఆయనపైనే ఉంది.
పైగా కమర్షియల్ యాడ్స్ కు పవన్ దూరంగా ఉండి చాలా కాలమే అవుతుంది. టాలీవుడ్ సర్కిల్స్, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందట. పవన్ కళ్యాణ్ కి జూబ్లీ హిల్స్ లో ఖరీదైన ఇంటితోపాటు.. హైదరాబాద్ శివారులో 18 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే పవన్ కళ్యాణ్ కి 312 గ్రాముల బంగారం ఉంది. పవన్ కళ్యాణ్ బిగ్ సెలెబ్రిటీ పైగా జనసేన పార్టీ అధినేత. కాబట్టి కార్ల వాడకం ఎక్కువగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్ద మెర్సిడెస్ బెంజ్ ఆర్ క్లాస్ కారు, వోల్వో ఎక్స్ సి 90, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి క్యూ7 లాంప్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
ఇక తన సతీమణి అన్నా లెజినోవా వద్ద రూ.30 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. తన పెద్ద కుమారుడు అకీరా పేరుమీద రూ.1.5 కోట్లు, కుమర్తె ఆద్య పేరుపై రూ.1.04 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పేరుపై, మరో కుమార్తె పోలేనా పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. పవన్ కి వస్తున్న రెమ్యునరేషన్ జనసేన పార్టీ ఖర్చులు, ఇతర రొటేషన్ కి సరిపోతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ దాదాపు రూ.30 కోట్లకి పైగా అప్పు కూడా ఉన్నట్లు సమాచారం. ఇందులో విచిత్రం ఏంటంటే.. తన మిత్రుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా పవన్ రెండున్నర కోట్ల అప్పు ఉన్నారట. మరో సందర్భంలో తన వదిన సురేఖకు కూడా అప్పు ఉన్నట్లు పవన్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…