Flight Accident : అప్ప‌ట్లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం గురించి తెలుసా.. కొంచెం తేడా వ‌చ్చినా ఎంతో మంది ప్ర‌ముఖులు చ‌నిపోయి ఉండేవారు..

Flight Accident : ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే నిపుణులకు అర్థమైపోతుంది. కానీ అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఉండేది కాదు. అప్పట్లో సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో విమానాలలో ఏర్పడ్డ చిన్న సమస్యలు కూడా వెంటనే అంచనా వేయగలుగుతున్నారు. కానీ 1993 నవంబర్ 15న ఇలాంటి సాంకేతిక లోపంతో ఒక విమానం పెను ప్రమాదం ఎదుర్కొంది.

ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం భారీ ప్రమాదానికి గురైంది. అదృష్టం వలన అందులో ఎవరూ చనిపోలేదు. విమానంలో ప్రయాణిస్తున్న 262 మంది ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అదే సమయంలో ఆ విమానంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వాణిశ్రీ, విజయశాంతితోపాటు పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్న రోజులవి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు చేయడానికి ఎక్కువగా చెన్నైకి వెళ్ళవలసి వచ్చేది.

Flight Accident

1993 నవంబర్ 15 ఉదయాన్నే ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ విమానం చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. సరిగ్గా తిరుపతి ప్రాంతానికి చేరేసరికి, దట్టమైన పొగ మంచు వల్ల విమానం ల్యాండింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. పైలెట్ కు సమాచారం అందింది. ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి మళ్లీ విమానాన్ని తిరిగి చెన్నైకి మళ్ళించాలని అనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఆయన ఒక విషయాన్ని మాత్రం గమనించలేదు. విమానం వెనక్కి తిప్పి కొంత దూరం వెళ్లేసరికి విమానంలో సరిపడేంత ఫ్యూయల్ లేదని గ్రహించాడు. దీంతో విమానంలో గందరగోళం ఎదురైంది. అందరూ టెన్షన్ తో ఏమైందో అర్థం కాక భయపడుతూ అరవడం మొదలు పెట్టారు.

ఇది మా ఆఖరి రోజు అని అందరు అనుకోవడం  మొదలు పెట్టారు. ఎలాగైనా ఫ్యుయల్ సేవ్‌ చేయాలని పైల‌ట్  విమానాన్ని తక్కువ లెవల్ కీ తీసుకొచ్చారు. వేగాన్ని తగ్గించడం కోసం ఫ్లాబ్స్ ఓపెన్ చేశాడు. అందరూ ఫ్లాబ్స్ ఓపెన్ అయ్యాయి అనుకున్నారు కానీ ఈ సమయంలోనే మరో విమానంలోని ఫ్లాబ్స్ తో లో లెవెల్‌లో వెళుతుండటం చూసి అలర్ట్ అయ్యారు. విమానం వెళ్లే మార్గాలు జామ్ అయిపోయాయి.

ఇక పైల‌ట్ విషయాన్ని అర్థం చేసుకొని విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు.  కానీ ల్యాండ్ చేయడానికి పైలెట్ కి సరైన స్థలం కనిపించటంలేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలు, దట్టమైన చెట్లు, విద్యుత్ స్తంభాలు కనిపిస్తున్నాయి. అలా విమానం కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ఎండిపోయిన సరస్సు కనిపించడంతో ల్యాండింగ్ కు ఇదే సరైన స్థలమని భావించి విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు.

ల్యాండింగ్ సమయంలో విమానం ఫ్రంట్ వీల్ ఒక్కసారిగా విరిగిపోవడంతో విమానం ఒకేసారిగా ల్యాండ్ అయిపోయింది. ఆ సమయంలో విమానంలో ఫ్యుయల్ లేకపోవడం ఒక అదృష్టంగా భావించవచ్చు. ఒకవేళ ఫ్యుయల్ ఉండి ఉంటే విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయి ఉండేది. పైల‌ట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి మన సినీ ప్రముఖులు కూడా బయటపడటం అనేది అదృష్టంగా భావించవచ్చు.

Share
Mounika

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM