Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాల గురించి కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. గత 4 దశబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీనీ ఏలుతున్న నటుడు ఆయన. ఈ 40 సంవత్సరాలలో ఆయన నటించిన సినిమాలకు గాను ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈ విషయాలన్నీ మనలో చాలా మందికి తెలిసినవే. కానీ ఇన్ని ఏళ్లలో ఆయన సంపాదించిన స్థిర చరాస్తుల గురించి గానీ వాటి విలువ గురించి గానీ మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
మెగాస్టార్ చిరంజీవి ఈ ఆగస్టు 22కి 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఈయన మొత్తం ఆస్తుల విలువ రూ.1500 కోట్లుగా తెలుస్తోంది. ఈయన స్థిరాస్తుల వివరాల్లోకి వెళితే.. అత్యంత ఖరీదైన స్థలాలు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈయనకు ఉన్న విలాసవంతమైన ఇల్లు అర ఎకరం పైగానే ఉంటుంది. దీని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. అంతే కాకుండా చెన్నై లో ఉన్న ఇంటి విలువ రూ.2 కోట్లు. ఇంకా ఈ మధ్యనే బెంగుళూరు లో కొన్న ఇంటి విలువ రూ.28 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇంకా బెంగళూరు, చెన్నై లలో రూ.13 కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి.
ఇంకా చరాస్తులు తీసుకుంటే ఈయనకు రూ.10 కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ కారు, రూ.2.50 కోట్లు విలువ చేసే 2 టొయోటా ల్యాండ్ క్రూజర్ కార్లు, రూ.4 కోట్లు విలువ చేసే 2 రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. ఇంకా ఆయన భార్య పేరుమీద రూ.90 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.
ఇక తెలుగు సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్లలో చిరంజీవి గారు ఒకరు. ఈయన ఒక సినిమాకి గాను రూ.40 నుండి రూ.50 కోట్లు తీసుకుంటారని తెలిసింది. అంతే కాకుండా సినిమాపై వచ్చే లాభాల్లో షేర్ కూడా వస్తుంది. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు టీవీ షో చేయడానికి గాను ఈయనకు ఒక్కో ఎపిసోడ్ కి రూ.10 లక్షలు అందాయి. ఇంకా వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఈయనకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తోంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…