Anjala Zaveri : తెలుగు సినీ ప్రేక్షకులకు అంజలా జవేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ యాక్ట్ చేసింది. ముఖ్యంగా చిరంజీవితో కలసి చూడాలని ఉంది, బాలకృష్ణతో సమరసింహారెడ్డి, వెంకటేష్‌తో ప్రేమించుకుందాం రా.., నాగార్జునలతో రావోయి చందమామ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి అందరినీ మెప్పించింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి అయ్యాక కూడా సినిమాల్లో అప్పుడప్పుడూ నటిస్తోంది. ఇక చివరిసారిగా ఆమె శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే మూవీలో నటించింది.
అయితే అంజలా జవేరికి పెళ్లయినప్పటికీ ఆమె భర్త గురించి చాలా మందికి తెలియదు. ఆయన టాలీవుడ్‌లోనే అనేక చిత్రాల్లో నటించారు. కానీ ఆయన ఆమె భర్తనే అన్న విషయం చాలా మందికి తెలియదు. తెలుగులో అనేక చిత్రాల్లో ఆయన విలన్‌గా నటించారు. ఆయనే తరుణ్ అరోరా. స్టైలిష్ గా ఉంటారు. మోడ్రన్ విలన్‌గా కనిపిస్తారు. అయితే ఈయన ఆమె భర్త అన్న విషయం ఎవరికీ తెలియదు.
తరుణ్ అరోరా అనేక హిట్ చిత్రాల్లో విలన్‌గా మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150లో, పవన్ కల్యాణ్ కాటమ రాయుడు, జయ జానకి నాయక, అర్జున్ సురవరం.. తదితర చిత్రాల్లో తరుణ్ అరోరా విలన్‌గా చేసి అలరించారు. ఇక అంజలా జవేరి, ఈయన ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ వీరికి ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు.
వీరికి వివాహం అయి సుమారుగా 6 ఏళ్లు కావస్తోంది. 20 ఏళ్లుగా ప్రేమించుకున్న తరువాత వీరు వివాహం చేసుకున్నారు. అయితే పిల్లలు లేకపోయినా సరే వీరు తమను తామే పిల్లలుగా అనుకుని ఎల్లప్పుడూ వారిలాగే ఉంటారు. ఈ విషయాన్ని తరుణ్ అరోరానే స్వయంగా చెప్పారు. ఇక అంజలా జవేరి కారణంగానే తరుణ్ అరోరాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…