హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం.
అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు. వీటితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు.
ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడిని స్మరిస్తూ దీపారాధన చేస్తుంటారు. దీపం వెలిగించిన తరువాత ఎలాంటి పరిస్థితులలో కూడా దీపాన్ని కింద పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఆ దేవ దేవతలను అవమానించినట్టే. కనుక దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు లేదా ధాన్యం లేదా చిన్న ఇత్తడి కంచు ప్లేట్ ను పెట్టాలి.
బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము. కనుక ఎలాంటి పరిస్థితులలోనూ బంగారాన్ని కింద పెట్టకూడదు. బంగారంను కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లేనని పండితులు చెబుతున్నారు.
హిందూ సాంప్రదాయాల ప్రకారం జంధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంతో పవిత్రమైన ఈ జంధ్యాన్ని కింద పెట్టడం వల్ల సాక్షాత్తూ తల్లిదండ్రులను, గురువులను అవమానించినట్లే.
సాలి గ్రామాన్ని సాక్షాత్తూ విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ సాలిగ్రామాలను కింద పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక వీటిని కూడా కింద పెట్టరాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…