Aishwarya Rajinikanth : తమిళ స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 18 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది ఉన్నఫలంగా విడిపోతున్నామంటూ విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా భార్యాభర్తల బంధం నుంచి విడిపోయిన తర్వాత ఐశ్వర్య తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య మెగాఫోన్ చేత పట్టి ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తూ బిజీ అయ్యింది. ఇలా ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా విడాకుల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా భార్య భర్తల బంధం నుంచి విడిపోయి స్నేహితులుగా ఉంటామని తెలియజేశారు.
విడాకుల అనంతరం ఈ జంట స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరి లేటేస్ట్ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్.. పయని అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేయగా.. ఈ వీడియోని తమిళ వెర్షన్ లో రజనీకాంత్, తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఇక ఈ వీడియోపై ధనుష్ స్పందిస్తూ.. పయని మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు.. అంటూ ధనుష్ పోస్ట్ పెట్టారు.
ఐశ్వర్య ఆయన ట్వీట్ కి స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే వీరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకుల తరువాత మొదటి సారిగా ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…