Devi Nagavalli : విశ్వక్‌సేన్‌తో గొడవ పెట్టుకోవడం ఏమోగానీ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లిని ప్రస్తుతం నెటిజన్లు దారుణంగా విమర్శిస్తున్నారు. ఆమెనే తప్పు చేసిందంటూ వారు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు చెందిన కొన్ని పాత వీడియోలను వారు షేర్ చేస్తూ ఆమెను తప్పు పడుతున్నారు. దేవి గతంలో స్వయంగా రోడ్డు మీద డ్యాన్స్ చేసిందని.. ఇప్పుడు వేరే వాళ్లు చేస్తే ఆమె ఎలా ఎందుకు ప్రవర్తిస్తోంది ? ఆమె సో కాల్డ్ జర్నలిస్టు అని చెప్పుకుంటూ.. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎందుకు మాట్లాడుతోంది ? అంటూ ఆమెనే అందరూ తప్పుబడుతున్నారు.
ఇక విశ్వక్‌సేన్‌కు సినీ రంగానికి చెందిన వారి నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే నటి కరాటే కల్యాణి, కమెడియన్ రాహుల్ రామకృష్ణ, సీనియర్ నటి కస్తూరితోపాటు హేతువాది బాబు గోగినేని, దర్శకులు హరీష్ శంకర్, బండి సరోజ్ వంటి వారు విశ్వక్ కే మద్దతు తెలిపారు. హరీష్ శంకర్ అయితే దేవి వీడియోలను వరుసగా పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ ఆమెపై వస్తున్న ట్రోల్స్ తాలూకు వీడియోలు కావడం విశేషం. అయితే దేవి గతంలో బిగ్ బాస్ 4 లో పాల్గొంది. అప్పట్లో ఆమెపై ఓ వీడియోను షో ముందు ప్రసారం చేశారు. అందులో ఆమె తన జర్నలిస్ట్ లైఫ్ ఎలా ప్రారంభమైందో చెప్పుకొచ్చింది.
తాను సంప్రదాయ కుటుంబంలో పుట్టానని దేవి ఆ వీడియోలో చెప్పింది. తమ ఇంట్లో మహిళలు ఉద్యోగాలు చేయడం అంటే చాలా కష్టమని.. కనుక ఇంట్లో అబద్ధం చెప్పి హైదరాబాద్ కు వచ్చానని.. తరువాత టీవీ 9లో రెజ్యూమ్ ఇచ్చి ఇంటర్వ్యూకు హాజరయ్యానని.. అలా అక్కడ సెలెక్ట్ అయి న్యూస్ యాంకర్ అయ్యానని తెలిపింది.
ఇక తన కెరీర్‌లో ఒక సమయంలో ఒక వార్త విషయంలో తప్పు చేశానని ఆమె తెలిపింది. ఒక యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పి ఆమె కుటుంబంపై స్టోరీ చేశానని.. కానీ ఆమెను ఆమె తండ్రే చంపాడని.. తనకు ఈ విషయం తెలియకుండా స్టోరీ చేశానని.. ఈ విషయంలో తప్పు చేశానని.. అప్పుడు ఎంతో బాధ పడ్డానని చెప్పింది. ఆ సమయంలో రెండు రోజుల పాటు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ అలా కూర్చుని ఉండిపోయానని చెప్పింది. అయితే ఈ పాత వీడియోను కొందరు మళ్లీ వైరల్ చేస్తూ.. దేవిని ట్రోల్ చేస్తున్నారు. ఆమెను విమర్శిస్తున్నారు. మరి వీటన్నింటికీ ఆమె సమాధానం చెబుతుందా.. అనేది చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…