ఢిల్లీలో శ్రద్ధ అనే యువతి హత్య సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఆఫ్తాబ్ అనే యువకుడు ఆమెను ముక్కలుగా నరికి ఢిల్లీ అంతటా పడేశాడు. తరువాత ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితున్ని పోలీసులు పట్టుకుని విచారించగా.. అతను అంగీకరించాడు. దీంతో పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసుల విచారణలో అనేక విషయాలు తెలిశాయి. ఆఫ్తాబ్ అంతా పకడ్బందీగా చేశాడు. కానీ ఒక చిన్న తప్పు వల్లనే అతను దొరికిపోయాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
శ్రద్ధ అనే యువతి కనిపించడం లేదని ఆమె తండ్రి ముంబైలోని వాసాయ్ పోలీస్ స్టేషన్ లో గత నెలలో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 26న పోలీసులు విచారణకు ఆప్తాబ్ ను పిలిచారు. అయితే శ్రద్ధ మే 22 నే ఢిల్లీ మెహ్రలిలో తాము నివసించే ఫ్లాట్ నుంచి వెళ్ళిపోయిందని అప్తాబ్ చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగాక తనను వదిలేసిందని పేర్కొన్నాడు. దుస్తులు, ఇతర వస్తువులను ఫ్లాట్ లోనే ఉంచి మొబైల్ మాత్రమే తనతోపాటు తీసుకెళ్లిందని నమ్మబలికాడు. ఆ తర్వాత మళ్లీ తనను ఆమె కలవలేదు అన్నాడు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల ముందే అంటే మే 18న ఆమెను అతను హత్య చేశాడు. అప్పటికి ఇద్దరు ఢిల్లీ ఫ్లాట్ కు మారి 2 వారాలే అయింది.
కాగా ఆప్తాబ్ ను విచారించిన అనంతరం పోలీసులు శ్రద్ధ మొబైల్ యాక్టివిటీని ట్రాక్ చేశారు. మే 22-26 మధ్య ఆమె ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు తేలింది. అలాగే శ్రద్ధ బ్యాంకు ఖాతా నుంచి ఆప్తాబ్ కు రూ.54వేలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. దీంతో పోలీసులకు అప్తాబ్ పై మరోసారి అనుమానం వచ్చింది. అనంతరం పోలీసులు శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్ చాట్ ను పరిశీలించారు. అందులో మే 31 ఆమె ఓ ఫ్రెండ్ తో చాట్ చేసింది. అప్పుడు కూడా ఫోన్ లొకేషన్ ఢిల్లీ మెహ్రలి లోనే ఉన్నట్లు చూపించింది. దీంతో వాసాయ్ పోలీసులు ఢిల్లీ పోలీసులను సంప్రదించారు. వెంటనే ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. మే 22న వెళ్లిపోయిన ఆమె ఫోన్ లొకేషన్ మే 31న కూడా ఢిల్లీ మెహ్రలి లోనే ఎలా ఉందని ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించాడు అప్తాబ్. తానే శ్రద్ధను హతమార్చి 35 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్లు చెప్పాడు. ఒక్కో పార్ట్ ను ఒక్కో రోజు తీసుకెళ్లి సమీపంలోని అడవిలో పడేసినట్లు వివరించాడు. కాగా ఆఫ్తాబ్ తాను ఓ ఇంగ్లిష్ సిరీస్ ఆధారంగా శ్రద్ధాను హత్య చేసినట్లు చెప్పాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…