Congress BJP : తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. అయితే హుజురాబాద్ లో తెరాసపై దాదాపుగా 24వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించడంతో.. బీజేపీకి ఈ విషయం కలసి వచ్చిందనే చెప్పవచ్చు. తెలంగాణలో పట్టుసాధించాలని అనుకుంటున్న ఆ పార్టీకి ఇది మరింత ఊతమిచ్చే విషయం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడు అయినప్పటికీ అక్కడ ఆ పార్టీకి మాత్రం ఓటు బ్యాంకు బాగానే ఉంది. అది గత ఎన్నికల్లో స్పష్టంగా రుజువైంది. ఆ ఎన్నికలలో 61వేల ఓట్లు రాగా, ఇప్పుడు కేవలం 3వేల ఓట్లు వచ్చాయి. ఈ విషయం కాంగ్రెస్‌ను తెగ కలవరపెడుతోంది.
రాజకీయాల్లో ఎన్నిసార్లు ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఇంతటి పరాభవం ఎదురుకాలేదు. గౌరవ ప్రదమైన స్థాయిలోనే ఓట్లను సాధించింది. అక్కడ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38,278 ఓట్లు తక్కువలో తక్కువ వచ్చాయి. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన కౌశిక్ రెడ్డికి సైతం 61వేల ఓట్లు వచ్చాయి.
కానీ గత ఉప ఎన్నికలో కేవలం 3వేల ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయి. ఇది కాంగ్రెస్‌కు ఘోర అవమానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓ జాతీయ పార్టీకి ఇంతటి తక్కువ స్థాయిలో ఓట్లు రావడం అంటే.. అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదు.. అని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొత్తంగా అనుసరించిన వ్యూహాలు బెడిసి కొట్టాయని స్పష్టమవుతోంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయని, అందుకనే తాము ఓడిపోయాయని, తెరాస నాయకుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయాన్ని ఇతర తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా పదే పదే చెబుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శత్రువులు. కానీ హుజురాబాద్‌లో రెండూ అనైతిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయని, అనధికారికంగా కలసి పోయాయని.. అందుకనే తెరాస ఓడిందని.. హరీష్ రావు ఆరోపించారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హరీష్ రావు ఆరోపణలు నిజమేనా అనిపించేలా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్‌లో బలమైన అభ్యర్థిని నిలపలేదని, దీంతో ఈటలకు పోటీ సులభం అయిందని, అందుకనే కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు వ్యవహరించారని అన్నారు.
అయితే హరీష్ రావు ఆరోపణలు, కోమటిరెడ్డి వ్యాఖ్యలను గమనిస్తే.. ఇందులో కొంతైనా నిజం ఉండకపోవచ్చని.. విశ్లేషకులు అంటున్నారు. లేదంటే కాంగ్రెస్‌కు మరీ అంత తక్కువ ఓట్లు ఎలా వస్తాయని అంటున్నారు. 3000 ఓట్లు అంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు అంతమంది కార్యకర్తలు కూడా లేరా ? అన్న అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు.
వాస్తవానికి హుజురాబాద్‌లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబాలు అన్నీ కలిస్తే 15వేల ఓట్లు ఉంటాయని, కానీ వారందరూ ఈటల రాజేందర్‌కు ఓటు వేసి ఉంటారని, తెరాస వ్యతిరేక ఓట్లను చీల్చడం ఇష్టం లేకే వారందరూ మూకుమ్మడిగా ఈటలకు ఓటు వేసి ఉంటారని, లేదంటే తెరాసకు ప్రయోజనం కలిగేదని.. ఓ కాంగ్రెస్ నేత అన్నారు. దీన్ని బట్టి చూస్తే తెరాస ఆరోపిస్తున్నట్లు హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కలసి పనిచేశాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ వారు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఎవరికి వారు.. ఇంకో పార్టీతో పనిచేసే ప్రసక్తే లేదని, అలా జరగదని అంటున్నారు. మరి హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరిగిందేమిటి ? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…