Conductor Jhansi : గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది. ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట. ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఝాన్సీ. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ చేసిన డాన్స్ పర్ఫార్మెమెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులైపోయారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, గ్రేస్, డాన్స్ మూమెంట్స్ ఏరేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఝాన్సీకి బంపర్ ఆఫర్ వచ్చింది.
జబర్దస్త్ లో వరుసగా బుల్లెట్ భాస్కర్ టీం లో కనిపిస్తున్న ఝాన్సీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వబోతుందంటూ ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. ఇటీవలే ఝాన్సీకి సంపూర్ణేష్ బాబు ఆఫర్ ఇచ్చాడంటూ ప్రచారం జరిగింది. ఆయన తన సినిమాలో ఐటమ్ సాంగ్ ని ఝాన్సీతో చేయించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే టాలీవుడ్ కి చెందిన ఒక యంగ్ హీరో సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రలో ఆమెకు అవకాశం దక్కిందట.. అందుకుగాను ఆమె 40 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉందట. నిర్మాతలు ఆమెకు 20 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడంతోపాటు 5, 6 లక్షల రూపాయల అదనపు చార్జీలు ఇవ్వనున్నారట.
ఆమె ఇప్పటికీ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతూనే స్టేజి షోలతో కూడా ఆకట్టుకుంటుంది. మరో వైపు కండక్టర్ ఉద్యోగం కూడా చేస్తుంది. ఝాన్సీ సినిమాలో సక్సెస్ అయితే వెనుతిరిగి చూసుకోనవసరం లేదని సినీ వర్గాల టాక్. సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా కూడా ఈటీవీలో కార్యక్రమాలను వదిలి పెట్టేది లేదంటూ ఇటీవల సన్నిహితుల వద్ద ఝాన్సీ చెప్పుకొచ్చిందట. ప్రస్తుతానికి కండక్టర్ జాబ్ కి లాంగ్ లీవ్ లో ఉన్న ఝాన్సీ త్వరలోనే ఆ జాబ్ కి రిజైన్ చేసినా ఆశ్చర్యం లేదు. డాన్స్ తో ఇరగదీసిన ఝాన్సీ సినిమాల్లో ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…