Chiranjeevi : నటుడు విశ్వక్‌సేన్‌ను ఉద్దేశించి దేవి నాగవల్లి మాట్లాడిన మాటలు ఏమోగానీ యావత్ సినీ ప్రపంచం ఆమెను తప్పుబడుతోంది. ఒక నటున్ని స్టూడియోకు పిలిచి ఇలా అవమానిస్తారా ? ఇదేనా జర్నలిజం అంటే ? అని చాలా మంది సినీ సెలబ్రిటీలు సదరు యాంకర్, చానల్‌ను ప్రశ్నిస్తున్నారు. అయితే దేవి నాగవల్లి ఇప్పుడు కాదు.. గతంలోనూ పలువురు హీరోలతోనూ ఇలాగే ప్రవర్తించింది. విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నల గడ్డతోనూ ఆమె ఈ విధంగానే మాట్లాడింది. దీంతో ఆమెను అందరూ విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పాత వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి ఆమె గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
అప్పట్లో చిరంజీవి తన ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజా అంకిత యాత్ర అని చేశారు. అయితే టీవీ చానల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం ఎంతగైనా తెగిస్తాయి.. అనే విషయాన్ని ఆయన తరువాత చెప్పారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అప్పటి విషయాలను వెల్లడించారు. అప్పుడు తాను యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట తాను యాత్ర చేస్తున్న బస్సులో ఏం జరిగిందో వివరించారు.
ఒక చోట యాత్ర సందర్భంగా ఒక వ్యక్తి ఖర్జూరాలు తినేందుకు ఇచ్చాడని.. అయితే తన చేతులను శుభ్రం చేసుకుని తిందామని చెప్పి శానిటైజర్ రాసుకున్నానని.. తరువాత ఖర్జూరాలను తిన్నానని.. అనంతరం ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇచ్చానని తెలిపారు. అయితే తాను ఖర్జూరాలను తినేందుకు శానిటైజర్‌ను రాసుకుంటే ఆ సంఘటనను వీడియోలో తీసేసి తాను శానిటైజర్ రాసుకున్నది.. తరువాత షేక్ హ్యాండ్స్ ఇచ్చినది.. ఆ రెండు వీడియోలను మాత్రమే కలిపి ఎడిట్ చేశారని.. తరువాత ఆ వీడియోలను రిపీటెడ్‌గా అన్ని చానల్స్ ప్రసారం చేశాయని.. అక్కడ జరిగిన అసలు విషయాన్ని వదిలేసి చిరంజీవి అలా చేశారు.. అనే విషయాన్నే వారు పదే పదే చూపించారని అన్నారు.
అయితే ఈ సంఘటన గురించి చిరంజీవి తరువాత జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. కాగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో చిరంజీవి ఆ సంఘటన గురించి చెబుతూ.. దేవి నాగవల్లిని ఉద్దేశించి మాట్లాడారు. దేవీ.. నవ్వకు.. అని అన్నారు. అంటే అప్పట్లో ఆమె ఆ చానల్‌లో ఉన్నప్పుడు ఆ సంఘటనలో ఆమెకు కూడా భాగం ఉందనే చిరంజీవి అలా అన్నారని స్పష్టమవుతోంది. తానంటే అప్పట్లో కొన్ని చానల్స్ కు ఎంతో ఇష్టం ఉండేదని.. తాను ఎప్పుడు తప్పు చేసి దొరుకుతానా.. ఎప్పుడు వీడియోలను టెలికాస్ట్ చేద్దామా.. అని ఆ చానల్స్ వారు కాచుకుని కూర్చుని ఉండేవారని.. చిరు ఆ చానల్స్‌పై అప్పట్లో సెటైర్ వేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేవి నాగవల్లి టాపిక్ నడుస్తుంది కనుక మరోమారు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు కూడా ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే దేవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…