Chiranjeevi Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడలలో చాలా మంది హీరోలు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఒక్కొక్కరూ తమ టాలెంట్‌తో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పవర్ స్టార్‌గా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రోజురోజుకీ పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు పవన్. ఈ సినిమా చేసే ముందే వైజాగ్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది.
ఈవీవీ సత్యనారాయణ చెప్పిన కథ నచ్చడంతో పవన్ ఓకే చేశాడు. ఇక ఈవీవీ – పవన్ సినిమా ఓకే అయ్యాక హీరోయిన్‌గా అనుకోకుండా అక్కినేని మనవరాలు సుప్రియను సెలక్ట్ చేశారు. ఆమెకు కూడా అదే ఫస్ట్ సినిమా. తన తమ్ముడిని ఇండస్ట్రీకి చాలా కొత్తగా పరిచయం చేయాలని చిరు భావించారు. పవన్ పోస్టర్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ముందు పవన్ ఫోటోలు బయటకు రిలీజ్ చేసి.. ఈ అబ్బాయి ఎవరు ? అంటూ బయటకు వదిలారు. తర్వాత ఇతడు పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చారు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి సంబంధించి చిరంజీవి స్వయంగా ఓ పెద్ద ఈవెంట్ పెట్టి మెగాఫ్యాన్స్‌కు ఇతడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ పరిచయం చేశాడు. ఈ పిక్‌లో చిరంజీవి పవన్‌ను పరిచయం చేస్తుంటే పక్కన నాగబాబు కూడా ఉన్నారు. ఇక షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ చిరు స్వయంగా షూటింగ్‌ను పర్యవేక్షించారు. సెట్స్‌లోకి వెళ్లి పవన్ హెయిర్ స్టైల్, డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలో పలు సూచనలు చేసేవారు చిరు. ఈ స్టిల్ చిరు పవన్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్నప్పుడు తీసిందే. అక్టోబర్ 11, 1996లో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అయ్యింది. 32 సెంటర్లలో 50 రోజులు, రెండు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఆ తరువాత పవన్ ఎలా సక్సెస్ సాధించారో మనందరికీ తెలుసు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…