మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఎన్నో సందర్భాల్లో చిరు ఎంతో మంది ఆర్టిస్టులకు, సామాన్యులకు సైతం సాయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా చిరు తన అభిమాని చివరి కోరికను తీర్చి అతనిలో ఆత్మ స్తైర్యం నింపారు. తన అభిమాని చివరి కోరిక తీర్చడం కోసం అన్ని పనులు మానుకున్నారు.
తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అభిమాని గుండెల్లో ధైర్యం నింపారు చిరంజీవి. గుండెలకు హత్తుకుని ఓదార్చారు. చిరంజీవి సొంతూరు మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్ కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన అతను చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం చిరంజీవి దగ్గరకు చేరింది. ఆయన వెంటనే స్పందించారు.
వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి అతనికి మానసిక స్థైర్యాన్ని అందించారు. అంతేకాక ఆర్థిక సాయం కూడా అందించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే చిరు మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ గా కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో ఇండస్ట్రీ తరపున నిలిచి కరోనా వెల్ఫేర్ ఫండ్ ను స్థాపించి అనేకమంది సినీ కార్మికులకు సహాయం అందించారు చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దీనితోపాటు బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమా కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను కూడా చేస్తున్నారు చిరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…