Chiranjeevi : నందమూరి బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై చేసిన షో.. అన్‌స్టాపబుల్. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విశేషమైన రీతిలో ఆదరణ లభించింది. పలువురు స్టార్స్‌తో బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోలో భాగంగా ఆయన సెలబ్స్‌ను పలు సంచలన ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు రాబట్టారు. ఇక ఈ షో తొలి సీజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు చూసిన షోగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఈ షోను ప్రేక్షకులు 40 కోట్ల నిమిషాల పాటు చూశారు. ఇది కూడా ఒక రికార్డే కావడం విశేషం.

ఇక అన్‌స్టాపబుల్ షో చివరి ఎపిసోడ్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేయగా.. అది బంపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే తొలి సీజన్ కూడా ముగిసింది. దీంతో ఇప్పుడు ఈ షో రెండో సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే రెండో సీజన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మొదటి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవిని ఒక ఎపిసోడ్‌కు ఆహ్వానించాలని చూశారు. కానీ వీలు కాలేదు. దీంతో రెండో సీజన్‌లో అయినా కచ్చితంగా చిరంజీవిని ఈ షోకు రప్పించాలని చూస్తున్నారు. మరి చిరంజీవి ఈ షోకు హాజరు అవుతారా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలలో ఆయన వరుసగా నటిస్తున్నారు. దీంతో ఆయన రెండో సీజన్‌కు అయినా సరే హాజరు అవుతారా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ కచ్చితంగా ఆయనను షోకు రప్పించాలని నిర్వాహకులు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.