Chiranjeevi : మెగాస్టార్ చికంజీవి ఈమధ్యే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ మూవీ అనుకున్న ఫలితాన్ని అందించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిరాశ పరిచింది. ఈ క్రమంలోనే చిరంజీవి తన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీని దసరాకు రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే కాకుండా భోళా శంకర్, వాల్తేరు వీరయ్య మూవీలు కూడా లైన్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కానేలేదు.. చిరంజీవి ఇంకో సినిమాను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తమిళ దర్శకుడితో సినిమా కావడం విశేషం.
ఇటీవలే చిరంజీవిని కమలహాసన్, లోకేష్ కనగరాజ్‌లు కలిసిన విషయం విదితమే. కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి లోకేష్ దర్శకుడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు వచ్చిన వీరిని చిరంజీవి సన్మానించారు. వీరికి తన ఇంట్లోనే చిరు విందు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్‌ను మూవీ గురించి చిరంజీవి అడిగారట. గతంలో లోకేష్ ప్రభాస్‌కు ఓ స్టోరీ చెప్పారట. కానీ ప్రభాస్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశారట. అయితే దానికి చిరంజీవి కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులకు ఓకే అయితే తాను లేదా చరణ్ ఆ సినిమా చేసేందుకు సిద్ధమని చిరు.. లోకేష్‌తో అన్నారట. దీంతో లోకేష్ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.
అయితే ప్రభాస్ రిజెక్ట్ చేసిన స్టోరీతో చిరంజీవి సినిమా తీస్తారా.. లేక ఆయన తనయుడు చరణ్‌కు ఆ సినిమాను అప్పగిస్తారా.. అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవితోపాటు దర్శకుడు లోకేష్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కనుక ఒక వేళ చిరంజీవితోనే సినిమా చేయాలన్నా.. కనీసం ఈ ఇద్దరూ ఇంకో ఏడాది వరకు ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఇదే సమయం వరకు వీరు ముహుర్తం కుదిరితే సినిమా చేసే అవకాశం ఉంది. లేదా చరణ్‌కు చిరంజీవి ఈ మూవీని అప్పగించవచ్చు. మరి ఇద్దరిలో ఈ మూవీలో ఎవరు నటిస్తారో.. వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…