Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన హిట్స్ సాధించారు. ఆయన తీసిన అనేక సినిమాలు హిట్ అయ్యాయి. కెరీర్ మొదట్లో చిరంజీవి ఎన్నో కష్టాలు పడ్డారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి దర్శకుడు, నిర్మాతకు ఆయన అవకాశం ఇచ్చేవారు. అలా ఆయన మర్యాద ఉన్న వ్యక్తిగా పేరుగాంచారు. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ పాత్రలలో కనిపించినా.. ఆ సినిమాలు చాలా తక్కువ. ఆయన హీరో అయ్యాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎంతో మంది హీరోయిన్లతో ఆయన చేసిన చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఆయనతో కొందరు హీరోయిన్లకు మంచి పెయిర్ ఉండేది. అలాంటి పెయిర్‌లలో మాధవి ఒకరు. ఈమె చిరంజీవితో ఎన్నో సినిమాలు చేశారు.
అయితే చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో అంత ఫేమస్ కాదు. మాధవి అప్పటికే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. దీంతో ఓ షూటింగ్ సమయంలో చిరంజీవికి చెన్నైలో ఒక సాధారణ హోటల్‌లో బస ఏర్పాటు చేయగా.. మాధవికి మాత్రం ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక రోజు షూటింగ్‌కు కారు పంపించి మాధవి, చిరంజీవిలను అందులో తీసుకురమ్మని చెప్పారు. ఇక డ్రైవర్ ముందుగా మాధవిని పికప్ చేసుకుని తరువాత చిరంజీవి దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మాధవి కారు వెనుక సీట్‌లో కూర్చుని ఉంది.
ఇక చిరంజీవి కారు లోపలకి ఎంటర్ అవుతూనే వెనుక సీట్‌లో మాధవి పక్కన కూర్చున్నారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవి నా పక్కనే కూర్చుంటావా.. ముందు డ్రైవర్ సీట్ పక్కన కూర్చో.. అని గట్టిగా అరిచిందట. దీంతో చిరంజీవి ఏమీ మాట్లాడకుండా ముందు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారట. అలా ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఎన్ని చిత్రాలు వచ్చినా ఇద్దరూ ఒకే కారులో షూటింగ్‌కు వెళితే ముందు డ్రైవర్ పక్క సీట్లోనే ఆయన కూర్చునేవారట. కానీ తరువాత చిరంజీవి స్టార్ అయ్యారు. అప్పుడు మాధవినే ఆయన కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.
ఇండస్ట్రీలో ఇలా చిరంజీవిని ఎంతో మంది ఎన్నో అవమానాలకు గురి చేశారట. అయినప్పటికీ స్టార్ హీరో కావాలనే లక్ష్యంతో ఆయన కష్టపడ్డారు. మెగాస్టార్ అయ్యారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దటీజ్ మెగాస్టార్.. అనిపించుకున్నారు. ఆయన కెరీర్ ఆరంభంలో అన్ని కష్టాలు పడ్డారు కనుకనే స్టార్ హీరో అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీకే పెద్ద అయ్యారు. చిరంజీవిలో ఉన్న మంచి ప్రవర్తనకు, మర్యాదకు, మంచి గుణానికి పైన తెలిపిన సంఘటన ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…