Pakeezah : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించి ఇప్పుడు తిండికి డబ్బులు లేని పరిస్థితిలో ఉ న్నారు. ఉండటానికి ఇల్లు లేక, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ.. నానా కష్టాలు పడుతున్నారు.అలానే నటి పాకీజా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆమె డేట్స్ కూడా దొరికేవి కావు. అంత బిజీగా గడిపిన పాకీజా ఇప్పుడు సినిమా ఛాన్స్ లు లేక.. ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.పాకీజా అసలు పేరు వాసుకి కాగా, ఆమె కామెడీ ప్రధాన పాత్రలు చేసి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు ఆమె పరిస్థితి బాగోలేక ఒక హాస్టల్ లో ఉంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనస్థితి గురించి చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న నాగబాబు వెంటనే ఆమెకి లక్షరూపాయల చెక్ పంపించారు. అయితే ఆ విషయాన్ని బయటికి చెప్పలేదు. ఇటీవల నాగబాబును ఇంటర్వ్యూ చేస్తూ ఓ టీవీ ప్రతినిధి రోహన్ ఆ విషయాన్ని రివీల్ చేశాడు. వాసుకి ఆర్ధిక పరిస్థితి తనని కదిలించి వేసిందనీ, అందుకే తనకి తోచిన సాయాన్ని అందించానని నాగబాబు చెప్పారు. ఇక తాజాగా చిరంజీవి సైతం పాకీజా ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకొని సాయం చేశారు.
పాకీజాకి లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించిన చిరంజీవి.. తెలుగు సినిమాలు, బుల్లితెర సీరియల్స్ లో పాకీజాకు ఒక పాత్ర ఇచ్చి ఆమె ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరంజీవితో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా నాగబాబు, చిరంజీవి ఆర్థికంగా ఆదుకోవడంపై పాకీజా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ్ లో నన్ను పట్టించుకోలేదు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు నేను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగువాళ్లు వల్లే అంటూ ఎమోషనల్ అయ్యారు పాకీజా..అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా నటించిన వాసుకీ ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో లేడీ కమేడియన్ గా నటించి బాగానే సంపాదించిన అనారోగ్యం వలన ఆస్తులు కోల్పోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…