Ram Charan : రామ్ చరణ్ ని హీరోగా చూడడం చిరంజీవికి అసలు ఇష్టం లేదట..!

Ram Charan : సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. గ‌త 4 ద‌శ‌బ్దాలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీని ఏలుతున్న న‌టుడు ఆయ‌న‌. ఆయన సినీ జీవితంలో అధికశాతం హిట్స్ అందుకున్న చిత్రాలే ఉంటాయి. ఈ 40 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న న‌టించిన సినిమాల‌కు గాను ఎన్నో అవార్డుల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈ విష‌యాల‌న్నీ మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌వే. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ.. అది మెగాస్టార్ స్టామినా అంటూ అభిమానులు ప్రశంసలతో ఆయనను ఎంతగానో పొగుడుతూ ఉంటారు.

మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోస్ పరిస్థితి ఎలా ఉన్నా గానీ, ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనయుడు రామ్ చరణ్ కెరీర్ మాత్రం మెరుపు వేగంతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఆ తర్వాత మగధీర  చిత్రం సక్సెస్ తో అనేక అవకాశాలు దక్కించుకుంటూ సినిమాల్లో తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తన నటన పరంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలను అందుకున్నారు.

Ram Charan

ఇక అసలు విషయానికొస్తే నిజానికి మెగాస్టార్ చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ ని హీరోగా చూడడం ఇష్టం లేదట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలిసిన విషయం. ఆయన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. మొదటినుంచి ఇండస్ట్రీలో మనం పైకి ఎదుగుతుంటే వెనక తొక్కేసే జనాలు బోలెడు మంది ఉంటారు. ఈ కారణంగా ఆయన ఎదుర్కొన్న‌ టెన్షన్స్ ను చరణ్ ఫేస్ చేయకూడదని, నలుగురికీ ఉపయోగపడేలా రామ్ చరణ్ డాక్టర్ కావాలని కోరుకున్నారట.

కానీ చరణ్ కి మొదటి నుంచి సైన్స్ అంటే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదట. స్కూల్లో గుడ్ స్టూడెంట్ కానీ సూపర్ స్టూడెంట్ అయితే కాదు. ఇక చిరంజీవి చేసేదేమిలేక క్రమంగా తన ఆలోచనల నుంచి బయటకు వచ్చారట. అంతేకాకుండా అదే టైంలో రామ్ చరణ్ నేను హీరో అవుతాను అనే తన అభిప్రాయాన్ని వెల్లడిచేశారు. రామ్ చరణ్ ఇష్టాన్ని కాదనలేక సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు చిరు. దీంతో కొడుకు రామ్ చరణ్ యాక్టర్ కావడంతో కొడుకు డాక్టర్ కావాలనే చిరంజీవి కోరిక‌ అలాగే మిగిలిపోయింది.

Share
Mounika

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM