Chiranjeevi : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కట్ చేస్తే.. ఆచార్య ఇటు డైరెక్టర్ కెరీర్ లో హీరో చిరు కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో చిరు ఎక్కడికి వెళ్లినా ఆచార్య ప్రస్తావన తప్పని సరైంది.
తాజాగా చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆచార్య సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయన స్పందించిన తీరుపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నాడంటే.. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు ఆనంద పడేవాడిని.. ఫ్లాప్ వచ్చినప్పుడు బాధపడేవాడిని. అవి అప్పటి రోజులు. ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను. ఆచార్య విషయానికి వస్తే ఆ సినిమా ఫ్లాప్ నన్ను బాధించలేదు.
ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది చేశాం. బాధపడ్డ విషయమేమంటే.. నేను, చరణ్ కలిసి తొలిసారి నటించాం. ఆ సినిమా పరాజయం బాధించింది. తర్వాత మేం కలిసి నటించినా ఆ జోష్ ఉండకపోవచ్చు అని అన్నారు చిరంజీవి. అయితే ఆచార్య ఫ్లాప్‌పై చిరంజీవి స్పందించిన తీరుని నెటిజన్స్ వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను కాదని.. కొరటాల శివ సినిమా డైరెక్ట్ చేస్తారా. ఫ్లాప్ వస్తే దానికి అతన్నే పూర్తి బాధ్యుడ్ని చేయటం ఎంత వరకు కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే కానీ చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చేలా లేడు. ఇక గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…