Chiranjeevi : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే మూవీని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీని ఈ ఏడాది మే 13న విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదరలేదు.
అయితే కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఈ మూవీని మళ్లీ దసరాకు విడుదల చేస్తారని భావించారు. తరువాత సంక్రాంతి వరకు రిలీజ్ ఉంటుందని అనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడింది. ఇక ఈ మూవీని ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
కాగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ పాత్ర దాదాపుగా 30 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. రామ్ చరణ్ పాత్రే సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు. ఈ మూవీలో ఒక ప్రత్యేక పాటలో రెజీనా నటించిందని తెలిసింది. అలాగే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీతోపాటు చిరంజీవి మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తుండగా.. తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ లోనూ నటిస్తున్నారు. ఏది ఏమైనా తాజా ప్రకటన మాత్రం అభిమానులకు ఆనందాన్నిస్తుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…