Che guevara : చే గువేరా.. ఈ పేరు వినగానే యువత గుండెల్లో విప్లవ జ్వాలలు రగిలిపోతాయి. యువతకు చే గువేరా అంటే ఎంతో ఇష్టం. ఆయన నడిచిన బాటలో ప్రయాణించాలని యువత ఆలోచిస్తుంటారు. అందుకనే ఆయన బొమ్మలను దుస్తులపై, వాహనాలపై వేసుకుంటుంటారు. అయితే ఈ రోజు (అక్టోబర్ 9) వరకు చే గువేరా హత్య జరిగి 55 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ ఆయన రగిలించిన విప్లవ స్ఫూర్తి మాత్రం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
చే గువేరా విప్లవ పోరాట యోధుడు. ఆయనను ఎంతో మంది అభిమానిస్తారు. 1967, అక్టోబర్ 9న ఆయనపై కాల్పులు జరపగా చనిపోయారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఈ రోజును చే గువేరా వర్దంతిని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
చే గువేరా 14 జూన్ 1928 న అర్జెంటీనాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎర్నెస్టో చే గువేరా. ప్రజలు ఆయనను చే అని పిలుస్తారు. చే గువేరా మెడిసిన్ చదివినప్పటికీ ఆయన ఆ వృత్తి స్వీకరించలేదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. విప్లవ మార్గాన్ని ఎంచుకుని ఏకంగా మోటార్ సైకిల్‌పై అప్పట్లోనే 10 వేల కిలోమీటర్లకు పైగా పర్యటనలు చేశారు. అనేక చోట్లకు ఆయన వెళ్లి పేదల పక్షాన పోరాడారు. వారికి సహాయం చేశారు. కార్మికుల పక్షాన నిలబడి గొంతెత్తి గళం వినిపించారు. పెట్టబడిదారి శక్తులను అణచివేసే దిశగా పోరాటాలు చేశారు.
చే గువేరా చనిపోయినా ఆయన చూపిన బాట ఎంతో మందికి ఆచరణీయం, అనుసరణీయం. ఎంతో మందికి ఆయన ప్రేరణగా నిలుస్తున్నారు. కనుక చే గువేరా కు జోహార్..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…