Chaurasia : గత కొద్ది రోజులుగా వార్తలలో తెగ నానుతున్న పేరు చౌరాసియా. రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. నిందితుడు నటి చౌరాసియాతో అసభ్యంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆమె పెదాలు, మెడపై గాయాలున్నట్టు గుర్తించారు.
చౌరాసియాను అతడు చెట్ల పొదల చాటుకు తీసుకెళ్లే యత్నం చేశాడనీ.. ఈ క్రమంలోనే ఆమె కాలి మడమకు ఫ్రాక్చర్ అయిందనీ.. భావిస్తున్నారు. దీంతో నిందితుడు ఒక సైకోగా అంచనా వేస్తున్నారు. అయితే చౌరాసియా తాజా ఘటనపై స్పందిస్తూ.. కేబీఆర్ పార్కు సీవీఆర్ గేట్ సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని పేర్కొన్నారు. మెయిన్ గేట్ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురైనట్లు తెలిపారు.
డబ్బులు ఇస్తానని అనడంతో ఒక చేయి వదిలేశాడని, 100కి ఫోన్ చేస్తున్నానని తెలుసుకొని నా ఫోన్ లాక్కున్నాడని పేర్కొంది. ఇక హెల్ప్ అంటూ అరుస్తుండగా అదే పనిగా చేతులు, ముఖంపై దాడి చేశాడని వివరించింది.
బండరాయితో తన ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా తన మోచేతితో ప్రైవేట్ పార్ట్‌పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకున్నానని తెలిపారు. హెల్ప్ అని గట్టిగా అరవడంతో కాఫీ షాపులో వారు వచ్చారని తెలియజేసింది. తన చేతికి ఉన్న డైమండ్ రింగ్, సెల్‌ఫోన్‌ను గుర్తించాలని పోలీసులకు ఆమె విజ్ఞప్తి చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…