ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ నెల‌కు రూ.40వేల వ‌ర‌కు సంపాదించండి.. పెట్టుబ‌డి చాలా త‌క్కువ‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక రూపాయి సంపాదించాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా అనేక కంపెనీలు మూత ప‌డ్డాయి. దీంతో ఎక్క‌డా ఉద్యోగాలు ల‌భించ‌డం లేదు. ప్ర‌స్తుతం చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగుల‌నే తొల‌గిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో సొంతంగా ఉపాధి మార్గం వెతుక్కోవ‌డం ఒక్క‌టే మార్గం. అయితే స్వ‌యం ఉపాధి అంటే.. అందుకు డ‌బ్బు బాగా పెట్టుబ‌డి పెట్టాల‌ని అంద‌రూ అనుకుంటుంటారు. కానీ అలా చేయాల్సిన ప‌నిలేదు. చాలా త‌క్కువ పెట్టుబ‌డితోనే నెల‌కు రూ.40వేల వ‌ర‌కు సంపాదించే మార్గం ఒక‌టుంది. అదేమిటంటే..

ప్ర‌స్తుతం చాలా మంది దుస్తుల వ్యాపారాన్ని ఇంట్లోనే చేస్తున్నారు. అందువ‌ల్ల దీనికి పెట్టుబ‌డి పెట్టాల్సిన ప‌నిలేదు. కేవ‌లం మెటీరియ‌ల్‌కు మాత్ర‌మే ఖ‌ర్చు అవుతుంది. షాప్ రెంట్‌, క‌రెంట్ బిల్, అడ్వాన్స్ వంటివ‌న్నీ ఉండ‌వు. మెటీరియ‌ల్‌ను కొన‌డంతోపాటు కాస్త అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్‌ల‌పై దృష్టి సారించాలి. అంతే.. నెల తిరిగే స‌రికి సుల‌భంగా రూ.40వేల వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఎంతో ఇష్ట‌ప‌డే చీర‌ల‌ను అమ్మ‌డం ద్వారా ఇలా లాభం వ‌స్తుంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ వంటి అనేక న‌గ‌రాల్లో దుస్తులను హోల్ సేల్‌గా చాలా త‌క్కువ ధ‌ర‌ల‌కే విక్ర‌యిస్తున్నారు. రూ.100, రూ.200ల‌కే చీర‌లు, ష‌ర్ట్స్‌, ప్యాంట్స్ ను విక్ర‌యిస్తున్నారు. రూ.100 ధ‌ర ఉండే ప్యాంట్స్‌, ష‌ర్ట్స్‌, చీర‌ల‌ను ముందుగా కొనాలి. రూ.20వేలు పెట్టి కొంటే.. ఒక్కోదానికి రూ.100 అనుకున్నా.. మొత్తం 200 యూనిట్స్ వ‌స్తాయి. వీటిని రెట్టింపు ధ‌ర‌కు విక్ర‌యించినా చాలు ఎంతో లాభం పొంద‌వ‌చ్చు. ఒక్కో యూనిట్ (ష‌ర్ట్‌, ప్యాంట్ లేదా చీర‌) ను రూ.200 కి విక్ర‌యిస్తే.. రూ.100 లాభం వ‌స్తుంది. అంటే నెల‌లో మొత్తం 200 యూనిట్స్‌ను విక్ర‌యిస్తే రూ.40వేల వ‌ర‌కు వ‌స్తాయి. ఇలా మ‌నం లాభం పొంద‌వ‌చ్చు. యాడ్స్ ఇవ్వ‌ద‌ల‌చుకుంటే.. యూనిట్ ఖ‌రీదును కాస్త పెంవ‌చ్చు. రూ.230 చేస్తే చాలు. ఆ పైన వ‌చ్చే రూ.30ని యాడ్స్ కోసం వాడ‌వ‌చ్చు. దీంతో ప‌బ్లిసిటీ కూడా బాగా అవుతుంది. లోక‌ల్‌గా ఉండేవారు చాలా మంది వ‌చ్చి దుస్తుల‌ను కొంటారు. ఇలా ఇంట్లోనే దుస్తుల‌ను విక్ర‌యించ‌డం ద్వారా చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గాన్ని పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM