Most Eligible Bachelor : సినిమా ఇండస్ట్రీలో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాలన్నీ అద్భుతమైన విజయాలను అందుకుంటాయనడంలో సందేహం లేదు. కథల ఎంపిక విషయంలో అల్లు అరవింద్ ప్రత్యేక దృష్టిసారించి సినిమాలని ఎంపిక చేసుకుంటారు. ఈ విధంగా ఎంపిక చేసిన చిత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.
అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ కు ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేకపోవడంతో అతనితో మంచి సూపర్ హిట్ సినిమా చేయాలని అల్లు అరవింద్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ వినగానే తనకెంతో నచ్చిందని వెంటనే సినిమాకు ఓకే చెప్పారు. అయితే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి చేసిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని దర్శకుడు భాస్కర్ తెలియజేశారు. ఇందుకు ముందుగా ఒప్పుకొని బన్నివాసు ఆ తర్వాత భాస్కర్ ఐడియా నచ్చడంతో ఈ విషయాన్ని అల్లు అరవింద్ దగ్గర ప్రస్తావించారు.
ఈ విధంగా కథ మొత్తం మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారని ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుందని, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని, అఖిల్ కెరీర్ లో ఇదొక మంచి సినిమాగా నిలబడుతుంది.. అంటూ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…