Bro Daddy Movie Review : మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన బ్రొ డాడీ మూవీ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్‌లాల్‌తో కలిసి లూసిఫర్ తరువాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మరి బ్రొ డాడీ మూవీ అంచనాలను అందుకుందా.. ఎలా ఉంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
జాన్ కట్టడి (మోహన్ లాల్) అన్నమ్మ (మీనా సాగర్)లు అన్యోన్యమైన దంపతులు. 25 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తుంటారు. వారికి ఒకే ఒక్క కుమారుడు ఈశో (పృథ్వీరాజ్ సుకుమారన్). అతను బెంగళూరులో ఓ అడ్వర్టయిజింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఇక కురియన్ (లాలు అలెక్స్) జాన్ కట్టడి ఫ్యామిలీ ఫ్రెండ్. అన్నా (కల్యాణి ప్రియదర్శన్) అతని కుమార్తె. ఈమె కూడా బెంగళూరులోనే పనిచేస్తుంటుంది. అయితే ఈశో, ఆమె లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. కానీ ఇరు కుటుంబాలకు ఆ విషయం తెలియదు. అకస్మాత్తుగా వారి లైఫ్ చేంజింగ్ సంఘటన చోటు చేసుకుంటుంది. అసలు ఆ సంఘటన ఏమిటి ? వారు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు తమ కుటుంబాలను ఎలా చేరుకున్నారు ? తరువాత ఏం జరిగింది ? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. బ్రొ డాడీ మూవీని చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్..
మోహన్‌లాల్ మరోసారి ఇందులో తన అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆయన నటనకు అసలు ఎలాంటి వంక పెట్టాల్సిన పనిలేదు. తనకు ఇచ్చిన పాత్రలో ఆయన జీవించారు. తన కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. అలాగే పృథ్వీరాజ్ కూడా చక్కని ప్రదర్శన ఇచ్చాడు. లాలు అలెక్స్ తన పాత్రలో జీవించారు. కల్యాణి ప్రియదర్శన్ తన పాత్రకు న్యాయం చేశారు. మీనా, కణిహలు కూడా తమ పాత్రల పరిధుల మేర నటించారు.
పృథ్వీరాజ్ చాలా సీరియస్ విషయాన్ని కామెడీగా చెప్పడంలో విజయం సాధించాడనే చెప్పవచ్చు. ఆయన కామెడీని, ఎమోషన్స్‌ను చక్కగా హ్యాండిల్ చేశారు. ప్రేక్షకులు తెర వైపు కళ్లార్పకుండా చూస్తారంటే అతిశయోక్తి కాదు.
మైనస్ పాయింట్లు..
సినిమా కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు కొత్తగా చెప్పేందుకు ప్రయత్నం చేశాడు. అయితే మొదటి హాఫ్ లో స్క్రీన్ ప్లే వేగంగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో స్పీడ్ తగ్గుతుంది. క్లైమాక్స్‌లో మళ్లీ స్పీడ్ పెరుగుతుంది. కొన్ని సీన్లు సెకండాఫ్‌లో బోరింగ్‌గా అనిపిస్తాయి. లెంగ్త్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అలాగే ఉన్ని ముకుందన్, సౌబిన్ షహర్‌ల సీన్లు మెయిన్ కథకు అడ్డంకిగా అనిపిస్తాయి.
టెక్నికల్ విషయానికి వస్తే.. చక్కని ప్రొడక్షన్ విలువలతో సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ అభినందన్ రామానుజమ్ చక్కగా వర్క్ చేశారు. చక్కని విజువల్స్‌ను అందించారు. అలాగే దీపక్ దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. స్టోరీకి తగిన మ్యూజిక్‌ను ఇచ్చారు. అఖిలేష్ మోహన్ ఎడిటింగ్ బాగుంది. చివరగా.. నటుడు పృథ్వీరాజ్ దర్శకుడిగా రెండోసారి తనను తాను నిరూపించుకున్నారనే చెప్పవచ్చు.
తీర్పు..
బ్రొ డాడీ మూవీ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు సీరియస్ విషయాన్ని కామెడీగా చెప్పాడు. చివరకు ఎమోషనల్ గా ఉంటుంది. అందువల్ల కుటుంబంతో కలిసి ఈ మూవీని సరదాగా ఒకసారి చూడవచ్చు. చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందవచ్చు.
మూవీ : బ్రొ డాడీ (మళయాళం, డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్)
నటీనటులు : మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమారన్, మీనా సాగర్, కల్యాణి ప్రియదర్శన్, లాలు అలెక్స్, కణిహ, సౌబిన్ షహర్, ఉన్ని ముకుందన్ తదితరులు
దర్శకుడు : పృథ్వీ రాజ్ సుకుమారన్
నిర్మాత : ఆంటోనీ పెరంబవూర్
సంగీతం : దీపక్ దేవ్
సినిమాటోగ్రఫీ : అబినందన్ రామానుజమ్
ఎడిటర్ : అఖిలేష్ మోహన్
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…