Ram Charan : సాధారణంగా సినిమాలలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకుంటారు. కొందరైతే ఏకధాటిగా ఏడుస్తూ ఉంటారు. మరికొందరు ఆ బాధను వారి గుండెల్లోనే పెట్టుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన RRR సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ఇక అల్లూరి పాత్రలో ఉన్న చరణ్ బ్రిటిష్ వారి చేత దెబ్బలు తింటారు.
ఈ విధంగా ఈ సినిమాలో రామ్ చరణ్ ను కొట్టడం వంటి ఎమోషనల్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇలా రామ్ చరణ్ దెబ్బతినడంతో అది చూసిన ఓ బుడ్డోడు థియేటర్లోనే తన అభిమాన నటుడు రామ్ చరణ్ ను కొట్టారని ఆయనని ఈ సినిమాలో విలన్ ను చేశారంటూ బోరున ఏడ్చాడు. ఇక ఈ విషయం గమనించిన పక్కన వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బుడ్డోడు రామ్ చరణ్ ను కొట్టినందుకు ఏడుస్తూ ఉండగా పక్కనే ఉన్న తన తల్లి నిజంగా కొట్టలేదని తిరిగి వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఆ బుడ్డోడు ఏకధాటిగా ఏడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…