Bithiri Sathi : బిత్తిరి సత్తిగా పేరుగాంచిన చేవెళ్ల రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మొదట్లో వీ6 న్యూస్ చానల్‌లో తీన్మార్ వార్తల్లో కనిపించారు. తరువాత టీవీ9 ఆ తరువాత సాక్షి చానల్స్‌లో పనిచేశారు. అయితే అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ చానల్‌ను నిర్వహిస్తూ పాపులర్ అయ్యారు. అలాగే కొత్త సినిమాలకు చెందిన నటీనటులను ఇంటర్వ్యూలను చేస్తున్నారు. పలు కార్యక్రమాల్లోనూ ఈయన సందడి చేస్తున్నారు. అయితే అప్పటికన్నా ఇప్పుడు బిత్తిరి సత్తి ఎక్కువ ఆదాయం పొందుతున్నారని చెప్పవచ్చు.
బిత్తిరి సత్తితో చాలా మంది నటీనటులు ఇంటర్వ్యూలు చేస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ ఆ తరువాత అంటే సుందరానికి.. ఇలా పలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పలు సినిమాలకు చెందిన నటీనటులను ఈయన ఇంటర్వ్యూ చేశారు. ఇక ఒక్క ఇంటర్వ్యూకు గాను ఈయనకు రూ.3 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. టీవీల్లో ఏదైనా ఒక షోలో ఒక ఎపిసోడ్‌లో కనిపించినా కూడా ఈయన ఇంతే మొత్తాన్ని తీసుకుంటున్నారట.
ఇక బిత్తిరి సత్తికి యాడ్స్ లో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన ఒక్క యాడ్ చేసేందుకు రూ.6 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన నటించిన పలు యాడ్స్ కూడా టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. న్యూస్ చానల్స్‌లో ఉన్నప్పటి కన్నా వాటి నుంచి బయటకు వచ్చాకే సత్తి ఎక్కువగా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…