Bithiri Sathi : బిత్తిరి సత్తి.. అలియాస్ చేవెళ్ల రవి.. ఈయన పేరు చెబితేనే చాలు.. మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. వెండితెరపై బ్రహ్మానందం కామెడీ చేస్తూ ఎంతటి పేరు తెచ్చుకున్నారో.. బుల్లితెరపై బిత్తిరి సత్తికి కూడా అంతే పేరు వచ్చింది. తనదైన శైలిలో భాషను మాట్లాడడం ఒక్క ఈయనకే చెల్లింది. శుభాకాంక్షలకు బదులుగా శుభా కలెక్షన్లు అన్నా.. రామ్ చరణ్ కు బదులుగా చరణాలు సార్.. అన్నా.. అది సత్తికే చెల్లింది. ఇలా సత్తి భాషను ఈయన కనిపెట్టారు. ఈ క్రమంలోనే తక్కువ కాలంలోనే ఈయన ఎంతో పాపులర్ అయ్యారు. సత్తి మొదట్లో వీ6 న్యూస్ చానల్‌లో తీన్మార్ వార్తలలో కనిపించారు. ఆ వార్తల ద్వారానే ఆయనకు బాగా పేరు వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన వీ6 నుంచి తప్పుకుని పలు ఇతర చానల్స్‌లో జాయిన్ అయ్యారు.
వీ6 చానల్ తరువాత సత్తి టీవీ9లో చేరారు. అక్కడ ఇస్మార్ట్ వార్తలు అనే ప్రోగ్రామ్ చేశారు. వీ6లో సావిత్రిగా అలరించిన శివజ్యోతి కూడా ఆ చానల్‌కు గుడ్‌బై చెప్పి టీవీ9లో చేరారు. అక్కడ ఈ ఇద్దరూ మళ్లీ కార్యక్రమంలో చేశారు. అయితే సత్తి అక్కడి నుంచి కూడా జంప్ అయి సాక్షిలో చేరారు. అక్కడ సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన సాక్షి నుంచి కూడా తప్పుకున్నారు. ఆయన అందులో చేస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు మొదట్లో రేటింగ్స్ బాగానే వచ్చాయి. కానీ రాను రాను వీక్షకులు ఆ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో రేటింగ్స్ పడిపోయాయి. ఇక ఆ కారణమో.. మరొకటో తెలియదు కానీ.. సత్తి సాక్షి చానల్‌కు కూడా గుడ్ బై చెప్పారు.
అయితే సాక్షి చానల్ నుంచి బయటకు వచ్చాక.. సత్తి వేరే ఏ ఆఫర్‌ను కూడా ఒప్పుకోవడం లేదట. ఎందుకంటే ఆయన ఇవన్నీ వదిలేసి ఇకపై కేవలం సినిమాల్లోనే నటించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఈవెంట్స్, జబర్దస్త్ లాంటి షోలలో కనిపించాలని అనుకుంటున్నారట. కనుక ఇతర చానల్స్ నుంచి వచ్చే ఆఫర్లను వద్దనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక సత్తి త్వరలోనే చిరంజీవి సినిమాలో నటించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…