Tiger Nageswara Rao : యువ దర్శకుడు వశిష్ట ఒక పవర్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. బింబిసార చిత్రంతో హీరో కళ్యాణ్ రామ్ కెరియర్‌లో మర్చిపోలేని బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ రూ.వంద కోట్ల సినిమా క్లబ్‌లో చేరుకోవడానికి దూసుకుపోతోంది.
ఇప్పుడు ఈ చిత్రంపైనే యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ లో జరుపుతున్న చర్చలు కొత్త మలుపులు తీసుకున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాల భారీ బడ్జెట్ తో పోల్చినప్పుడు, తక్కువ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ చేసే అవకాశం ఇతర నిర్మాతలకు ఆసక్తికరమైన విషయంగా మారింది.
బింబిసార బృందం పని నైపుణ్యం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. బింబిసారకు ప్రయోగించిన విజువల్ ఎఫెక్ట్స్, రియలిస్టిక్ లుక్ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి. అయితే రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావుకి కూడా బింబిసార చిత్రం మంచి స్ఫూర్తినిచ్చింది. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో 1960, 80 కాలాన్ని చూపించడానికి ఇలాంటి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించనున్నారు.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో స్టువర్ట్ పురం గ్రామం సెట్‌ను రూపొందించడానికి బింబిసార బృందం ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్ వేర్ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇలా టెక్నాలజీని వాడుకోవడానికి గల కారణం ఏమిటంటే.. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు బృందం హైదరాబాద్‌లో రెండుసార్లు, రామోజీ ఫిలిం సిటీలో రెండుసార్లు, శంషాబాద్ ప్రాంతంలో మరొకసారి స్టువర్ట్ పురం గ్రామం సెట్స్ ను నిర్మించింది.
టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి సీజీలో డిజిటల్ పొడిగింపును రూపొందించడంలో సవాల్ గా మారింది. ఇప్పుడు బింబిసార సాంకేతిక నైపుణ్యం ఒక మార్గం చూపించడంతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్ర బృందానికి కొత్త ఆశలు మొలకెత్తినట్లు అయింది. దీంతో బింబిసార టెక్నాలజీనే ఉపయోగించాలని టైగర్ నాగేశ్వర్ రావు టీమ్ ఆలోచిస్తోంది. ఇక వారి ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…