Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ మధ్యే ఈ షోకు చెందిన ఓటీటీ వెర్షన్ ముగిసింది. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఇందులో బిందు మాధవి విన్నర్‌గా నిలిచింది. ఇందులో విన్ అయిన కంటెస్టెంట్లను నేరుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు ప్రమోట్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే వీరితోపాటు మిగిలిన కంటెస్టెంట్ల కోసం కూడా ప్రస్తుతం నిర్వాహకులు వెతుకుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 త్వరలోనే ప్రసారం అవుతుందని ఇటీవలే నాగార్జున చెప్పారు. ఇక ఈసారి కూడా ఆయనే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ప్రస్తుతం ఈ షోకు గాను కంటెస్టెంట్ల కోసం చూస్తున్నారు.
అయితే ఈసారి షోలో కామన్ మాన్ ఒకరు పాల్గొంటారని ఇదివరకే చెప్పారు. ఈ క్రమంలోనే కామన్ మాన్ ఎంట్రీ కోసం ఒక వారం పాటు పలు టాస్క్‌లను ఇస్తారట. వాటిల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన కామన్ మ్యాన్‌ను షోలోకి తీసుకుంటారట. ఇక ఈ షోను సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇది అధికారికంగా వెల్లడించిన తేదీ కాదు. కనుక ఇందులో ఎంత నిజం ఉంది.. అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఇదే తేదీ కన్‌ఫామ్ అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఈ సారి సీజన్‌లో అనిల్, మిత్ర, శివ, అమర్‌దీప్, ఆది, చైత్ర రాయ్, దీప్తి పిల్లి, నవ్య స్వామి, వర్షిణి, యాంకర్ ధనుష్ వంటి వారు పాల్గొంటారని సమాచారం. అలాగే హిందీ బిగ్ బాస్ నుంచి పలు టాస్క్‌లను తీసుకుని ఈ సారి సీజన్‌లో వాటిని పలుమార్లు అమలు చేయనున్నారని సమాచారం. దీంతో ఈ సారి సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుందని తెలుస్తోంది. అలాగే కొన్ని ఎపిసోడ్లను ఓటీటీలోనూ లైవ్ స్ట్రీమ్ చేస్తారని.. కేవలం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అకౌంట్ ఉన్నవారే ఈ లైవ్ స్ట్రీమ్ ను చూసేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…