Bigg Boss Telugu 6 : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఓటీటీలో బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా 24 గంటలు అందరినీ మెప్పించింది. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా అదిరిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పాపులర్ యాంకర్ ఉదయభాను, హీరో నందు, చలాకీ చంటి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ హాసన్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ వంటి పాపులర్ సెలబ్రిటీస్ ఈ బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు.
ఈ ఆగస్టు చివరి వారంలో గానీ సెప్టెంబర్ మొదటి వారంలో గానీ సీజన్ 6 ప్రారంభం కాబోతోందని సమాచారం. సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హోస్ట్ నాగార్జునపై పడింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గత సీజన్ లో నాగార్జున షో మొత్తానికి రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఇప్పుడు తాజాగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున ఏకంగా రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…