Bigg Boss : తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ పెరిగింది. ఈ ఎంటర్టైన్మెంట్ షోకి ఏర్పడిన ఆదరణ ఎలాంటిది అంటే వీక్షకులు వేరే కార్యక్రమాలపై ఆసక్తి చూపలేనంత రేంజ్ లో ప్రబంజనం సృష్టించింది. ఇప్పటి వరకు 5 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి కొన్ని ఎంతో మంచి ఆదరణ పొందింది. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. 5 సీజన్స్ కూడా ఒకదానిని మించి ఒకటి బంపర్ హిట్ అయ్యాయి. 5 వ సీజన్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ OTT సీసన్ ని ప్రారంభిస్తే అది కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇలా ముందు సీజన్స్ అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆరవ సీసన్ భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ముందు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ తో పోలిస్తే ఆరవ సీజన్ ఆడియన్స్ ని ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోతుంది అనే చెప్పుకోవచ్చు. మొదటిరోజు ఎపిసోడ్ కి కేవలం 8 టిఆర్పి రేటింగ్స్ మాత్రమే రావడం జరిగింది. ముందు ప్రసారమైన సీజన్స్ ప్రారంభ ఎపిసోడ్స్ ఏది కూడా 15 టిఆర్పి రేటింగ్స్ కి తగ్గేవి కాదు. కానీ బిగ్ బాస్ సీజన్ 6 కి మాత్రం వాటిల్లో సగం కూడా రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
ఇక రెగ్యులర్ ఎపిసోడ్స్ కి వచ్చే టిఆర్పి రేటింగ్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి. మొదటి వారం అన్నీ రోజులకు కలిపి యావరేజ్‌గా కనీసం 5 రేటింగ్స్ కూడా రాబట్టుకోలేకపోతుంది. దీనితో నాగార్జున గత వారం శనివారం రోజు హౌస్ మేట్స్ ని సరిగా ఆడడం లేదని కోపంతో క్లాస్ పీకడం అందరినీ షాక్ కి గురి చేసింది. నాగార్జున వార్నింగ్ తర్వాత అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బాగా ఆడి బిగ్ బాస్ షోకి టిఆర్పి రేటింగ్స్ పెంచుతారు అనుకుంటే మొదటి వారానికి రెండవ వారానికి పెద్ద తేడా కంటెస్టెంట్స్ ఎప్పుడు లాగానే తమ ఆటతీరును ప్రదర్శించారు.
హౌస్ లో రేవంత్, గీతూ, ఇనయ సుల్తానా తప్ప మిగిలిన హౌస్ మెంబర్స్ ఎవరు కూడా నాగార్జున మళ్ళీ తిడతారేమో అని భయపడి ఆడుతున్నారే తప్ప, ఎవరిలోనూ ఆడాలనే కసి మాత్రం చూపించడం లేదు అని చెప్పవచ్చు. మునుపటి సీజన్స్ లో బిగ్ బాస్ హౌస్ లో సభ్యులు ఆటని ఎంతో కసిగా, పట్టుదలగా ఆడేవారు. ప్రేక్షకులు కూడా ఎవరు గెలుస్తారో చూడాలని ఆసక్తి కలిగించే వారు. ఈసారి ఇంటి సభ్యులలో అలాంటి పట్టుదల ఎవరిలో కనిపించడం లేదు. వీక్షకులకు కూడా ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లు చూస్తుంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షో అంత ఆశాజనకంగా లేకపోవడంతో స్పాన్సర్ చేసే బ్రాండెడ్ కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా తప్పుకోవడం జరుగుతుందట. మరి ఈ షోని ప్రేక్షకులను మెప్పించి టిఆర్పి రేటింగ్ పెంచాలంటే బిగ్ బాస్ టీం ఏమైనా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తారో లేదో వేచి చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…