Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరో మూడు వారాలలో ముగియనుంది. ఎవరు విజేత, ఎవరు టాప్ 5లో ఉంటారనే దానిపై లెక్కలు మొదలయ్యాయి. మరోవైపు హౌజ్ నుండి బయటకు వస్తున్న విషయాలను గమనిస్తుంటే కొన్ని సెంటిమెంట్స్ కూడా బయటపడుతున్నాయి.
సింగర్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ చంద్ర తన ఆటతో, మాటలతో, పాటలతో ఆడియన్స్‌ను మెప్పిస్తూ షోలో కొనసాగుతున్నాడు. అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లందరూ హౌజ్ నుండి బయటకు వచ్చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. మొదట్లో హమీదాతో శ్రీరామ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఇద్దరూ కలిసి తెగ సందడి చేసేవారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమేమో అన్నట్టుగా ఉండేవారు. హమీదాను ఐదో వారంలో ఎలిమినేట్ చేశారు.
అప్పటి నుంచి శ్రీరామ్ బాగా డల్ అయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకుంటూ విశ్వకు దగ్గరవగా అతడిని కూడా పంపించేశారు. ఆ తర్వాత అనీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ ఆమెకు దగ్గర అవుతుండగా, అనీ మాస్టర్ కూడా బయటకు వచ్చేసింది.
ఇక ఇప్పుడు హౌజ్‌లో రవితో క్లోజ్‌గా ఉంటూ వస్తున్నాడు శ్రీరామ్. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రవికి ఇంటిసభ్యులెవరూ సపోర్ట్ చేయకపోయినా శ్రీరామ్ ఒక్కడే అతడికే ఓటేశాడు. దీన్ని బట్టి శ్రీరామ్‌కు రవి అంటే ఎంత అభిమానమో ఊహించవచ్చు. అలాంటిది రవి కూడా ఎలిమినేట్ అయిపోతే హౌస్‌లో శ్రీరామ్ ఒంటరిగా అయిపోయాడు. అతనితో క్లోజ్‌గా ఉన్న వాళ్లందరూ ఇలా బయటకు వచ్చేస్తున్నారేంటి.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…