Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుల్లితెరపై విపరీతమైన బజ్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలనేవి చాలా కామన్. గత సీజన్స్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దీక్షాసేత్, పూజా, కుమార్ సాయి, ముక్కు అవినాష్, స్వాతి దీక్షిత్ లను పంపారు. అయితే ఈసారి సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్స్ ని ఒకేసారి ఇంటి లోపలికి పంపారు.
దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలియాలని.. చాలా మంది అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో యాంకర్ వర్షిణి, విష్ణు ప్రియలు హౌస్ లో ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు. కానీ దానిపై ఏ ఒక్కరూ స్పందించలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో బ్యూటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి అన్షూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. అయితే ప్రీతి అన్షూ ఎవరంటే.. ఆమె ఓ మోడల్.
మై దిల్ అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. నటిగా మంచి క్రేజ్ ని తెచ్చుకోవాలని అనుకుంటుందట. అయితే ఈమెకు బిగ్ బాస్ ఎలా ఆఫర్ ఇస్తాడంటూ వార్తలు వస్తున్నా.. ఇదంతా వైరల్ అవ్వడానికి చేసే ఓ స్ట్రాటజీ అంటూ కొంతమంది నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే మొదట్లో ప్రీతి అన్షూ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇస్తుందని అనుకున్నవారే.. అదేం లేదు ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్, గాసిప్స్ పుణ్యమా అని మోడల్ ప్రీతి అన్షూ పేరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…