Bigg Boss 5 : బుల్లితెరపై ఎన్ని షోలు, సీరియల్స్ నడుస్తున్నా.. బిగ్‌బాస్ ప్రత్యేకతే వేరు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు అందరూ మరీ స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీంతో షో రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. తరువాత వారు జైలులో ఉంటారు. అనంతరం వారిని సేవ్ చేసి బయటకు తీసుకురావాలి. ఇక చివరి వరకు జైలులో ఉన్నవారు నామినేట్ అవుతారు. ఈ క్రమంలోనే సిరి, రవి, సన్నీ, మానస్, కాజల్ లు ఈ వారం నామినేట్ అయ్యారు.
అయితే నామినేషన్స్‌లో భాగంగా జైలులోకి వెళ్లి వచ్చిన షణ్ముఖ్ ప్రియాంకను నామినేట్ చేశాడు. అందుకు కారణం చెప్పమని అడిగితే.. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు పింకీ మైక్ విషయంలో సతాయించిందని చెప్పాడు. అందుకనే తనను నామినేట్ చేస్తున్నానని అన్నాడు. అయితే ఆ రీజన్ సరిగ్గా లేదని ప్రియాంక వాదించింది.
తనకు ఇంకొకరిని నామినేట్ చేసే ఆప్షన్ లేదని, కనుక ప్రియాంకను నామినేట్ చేయక తప్పడం లేదని షణ్ముఖ్ అన్నాడు. దీంతో ప్రియాంక మరింత రెచ్చిపోయింది. నీకు ఆప్షన్స్ లేకపోతే నన్ను వేసేస్తావా ? అని ప్రశ్నించింది. అది సిల్లీ రీజన్ అని ఆమె అనగా, తాను ఇంతేనని, ఇలాగే గేమ్ ఆడుతానని షణ్ణు చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన ప్రియాంక మళ్లీ సెటైర్ వేసింది. నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు నన్ను టార్గెట్ చేశావు, ఐయామ్ రెడీ.. అని ప్రియాంక జైలులోకి వెళ్లిపోయింది. ఇక ఈ వారం నామినేషన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండడంతో.. ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఆసక్తి నెలకొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…