Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో గత వారం రవి రూపంలో ఊహించని ఎలిమినేషన్ జరిగింది. టాప్ 3లో ఉంటాడనుకున్న రవిని ఇలా మధ్యలోనే బయటకు పంపడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. దీని గురించి బయటే కాదు ఇంట్లోనూ ఆసక్తికర చర్చ నడిచింది. మరోపక్క మానస్.. తనకు టైటిల్ ముఖ్యం కాదు, ప్రజల మనసులు గెలవడమే ముఖ్యమన్నాడు. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అన్న భయంతో హగ్ చేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు.
ఇక రవి లేని బాధ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది ప్రియాంక. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్‌షిప్ హగ్గంటూ షణ్నును హత్తుకుంది సిరి. మొన్న ఎపిసోడ్‌లో చాలా రియలైజ్ అయినట్టు ఫీలైన సిరి మళ్లీ హగ్ ఇవ్వడం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.
ఇక 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యులు తగిన కారణాలను చెబుతూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి. ముందుగా కెప్టెన్ షణ్ముఖ్.. కమ్యూనిటీ (ట్రాన్స్‌జెండర్) పేరు తీయడం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్ చేస్తూ ఆమె ఫేస్ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు. ప్రియాంక.. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కావట్లేదని టైం కావాలని అడగడంతో, నామినేషన్స్ తెలపకపోతే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు బిగ్ బాస్. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్ చేసింది. శ్రీరామ్.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్, కాజల్‌ను నామినేట్ చేశాడు.
ఎమోషనల్‌గా కనెక్ట్ అవకుండా నీ గేమ్ నువ్వు ఆడంటూ సిరి.. పింకీ ఫేస్ ఉన్న బంతిని తన్నింది. కమ్యూనిటీ అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేసింది. సన్నీ, మానస్.. సిరి, శ్రీరామ్‌లను నామినేట్ చేశారు. నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు అని భూతద్దంలో చూపిస్తున్నారంటూ కాజల్.. సిరి, ప్రియాంకను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇందులో బయటకు వెళ్లే ఛాన్స్ ప్రియాంక, కాజల్‌లో ఒకరికి ఉంది. రవి మాదిరిగా చేస్తే శ్రీరామ్ లేదా మానస్ అయినా బయటకు వెళతారనడంలో సందేహం లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…