Bigg Boss 5 : స‌న్నీ ప‌రువు తీసిన నాగార్జున‌.. హౌజ్ అంతా అత‌నికి వ్య‌తిరేకం..!

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మంలో శ‌నివారం చాలా వాడివేడిగా సాగింది. ముఖ్యంగా స‌న్నీని దోషిగా చూపించే ప్రయ‌త్నం చేశారు. ఇది స‌న్నీ అభిమానుల‌కి బాధ‌ను క‌లిగించింది. షో మొద‌ట్లో భీమ్లా నాయ‌క్ పాట‌తో వ‌చ్చిన నాగార్జున శుక్ర‌వారం ఏం జ‌రిగిందో చూపించారు. స‌న్నీ అన్ని మాట‌లు అన్నందుకు సిరి బాధ‌ప‌డ‌గా, సిరి మాట‌ల‌కు స‌న్నీ బాధ‌ప‌డుతూ క‌నిపించారు. ఇక అనీ మాస్ట‌ర్, కాజ‌ల్ బ‌ద్ద శ‌త్ర‌వులుగా మారారు.

సీక్రెట్ రూంలో ఉన్న జెస్సీని డాక్టర్లు పరీక్షించి.. ఎలా ఉందని అడిగాడు. తల తిరిగిపోయి చేతులు వంకర్లు పోతున్నట్టు.. బాడీని ఎవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.. పెదాలు ఉబ్బినట్టుగా అనిపిస్తోంది.. అని చెప్పాడు. మీ స్కాన్ రిపోర్ట్ చూశాక అంతా నార్మల్‌గానే ఉంది. ప్రమాదం ఏమీ లేదు. అయితే ప్రస్తుతం వాడుతున్న మెడిసిన్‌కి ఇది నార్మల్ పరిస్థితిలో ఉంటే.. రికవరీ అయ్యేవారు. మీకు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే పూర్తిగా మిమ్మల్ని పరీక్షించాల్సి ఉంది అని వైద్యులు చెప్పారు.

నాగార్జున కూడా జెస్సీ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు కాస్త ఫర్వాలేద‌ని అన్నాడు. రిపోర్ట్స్ అన్నీ బాగుంటే లోప‌లికి పంపిస్తా అని చెప్పాడు. ఇక నాగార్జున ఇంటి స‌భ్యుల‌తో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొద‌ట‌గా అనీ.. కాజ‌ల్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. అనీనీ అంద‌రు స‌పోర్ట్ చేయ‌డంతో కాజ‌ల్ షాక్ అయింది.

త‌ర్వాత ర‌వి.. వెరీ బ్యాడ్ బిహేవియ‌ర్‌, లూజ్ టంగ్ అంటూ స‌న్నీపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాడు. తంతా, అప్ప‌డం చేసి అమ్మేస్తా అన్నాడని ర‌వి చెప్ప‌డంతో తాను అన‌లేద‌ని బుకాయించాడు స‌న్నీ. దీంతో నాగ్ వీడియో ప్లే చేసి సన్నీ ఎలా ప్ర‌వ‌ర్తించాడో చూపించాడు. అంద‌రు స‌న్నీని ముద్దాయిగా తేల్చారు. త‌ర్వాత‌ స‌న్నీ.. సిరిని బోనులో నిల‌బెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మాన‌స్‌, కాజ‌ల్ త‌ప్ప‌ అంద‌రూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు.

మాన‌స్‌.. అనీ మాస్ట‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ప్ప‌టికీ అది వీగిపోయింది. శ్రీరామ‌చంద్ర‌.. ప్రియాంక‌ను బోనులో పెట్టాడు. ఎన్ని పాట‌లు పాడినా 100 రూపాయ‌ల కంటే ఎక్కువ ఇవ్వ‌లేద‌ని ఆరోపించాడు. మాన‌స్ గ‌ట్టిగా అర‌వ‌డం న‌చ్చ‌లేద‌ని అత‌డిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్‌మేట్స్ మాన‌స్‌ను నిర్దోషిగా తేల్చారు. త‌ర్వాత కాజ‌ల్‌.. అనీ త‌న‌ను వెక్కిరిస్తుందంటూ బోనులో నిల‌బెట్టింది. అయితే ఆమె వెక్కిరించ‌లేద‌ని, అది త‌న బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది.

ష‌ణ్ను.. నేను ఆడ‌వాళ్ల‌ను అడ్డం పెట్టుకుని ఆడ‌తాన‌న‌డం, న‌న్ను యూట్యూబ్ వ‌ర‌కే అని చెప్ప‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని బోనులో నిల‌బెట్టాడు. దీనికి సంబంధించిన‌ వీడియో కూడా ప్లే చేసి చూపించ‌గా.. ర‌వి, శ్రీరామ్‌, సిరి, అనీ.. స‌న్నీనే ముద్దాయిగా తేల్చారు. సిరి, స‌న్నీ గొడ‌వ ప‌డుతుంటే ష‌ణ్ను మ‌ధ్య‌లోకి రావ‌డం వ‌ల్లే గొడ‌వ పెద్ద‌దైంద‌ని తెలిపింది కాజ‌ల్‌. మొత్తం మీద నామినేష‌న్స్‌లో ఉన్న వారిలో స‌న్నీని సేవ్ చేశాడు బిగ్ బాస్.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM