Bigg Boss 5 : అనూహ్య పరిణామాల నడుమ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన జస్వంత్ కంటెస్టంట్స్ కి ల్యాండ్ ఫోన్ ద్వారా విలువైన సలహాలు, సూచనలు చేశాడు. ముందుగా సన్నీని పిలిచి.. టంగ్ కంట్రోల్‌లో పెట్టుకో. గేమ్ ను వ్యక్తిగతంగా ఆడు. మిగతా అంతా బాగుంది అని చెప్పాడు. అనంతరం మానస్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు సైలెంట్ కిల్లర్. రవికే బాబువి నువ్వు, ఒప్పుకోవు, కానీ ఇదే నిజం. నీ ఐడియాస్ బాగున్నాయ్ కానీ అందరినీ నెగెటివ్‌గా చూడకు’ అని సూచించాడు.
కాజల్‌తో మాట్లాడుతూ.. నవ్వకు.. నిన్ను తిట్టాలని ఉంది.. ఈ వారం రోజులు నిన్ను చూశాను.. ఎలా ఆడుతున్నావ్.. మొదట్లో ఉన్నట్టు ఉండు.. నీ ఐడియాతో నువ్ ఆడుకో.. గ్రూప్ కోసం ఆడకు.. నీ ఫ్రెండ్స్ నీకేం వాల్యూ ఇవ్వడం లేదు.. నిన్ను వాడుకుంటున్నారు.. తిట్టుకుంటున్నారు.. అది తెలుసుకో.. అని కనువిప్పు కలిగించాడు. అనీ మాస్టర్ గేమ్ బాగుందన్న జెస్సీ.. ప్రియాంక సింగ్‌ను త్యాగాలు ఆపేయమని హితవు పలికాడు.
‘తర్వాత సీజన్‌లో వచ్చేవాళ్లు నిన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి, అంతేకానీ అబ్బో, అది 10 వారాలు ఎలా ఉంది ? అని చులకనచేయొద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. శ్రీరామ్ టాప్ 5లో ఉంటాడని అభిప్రాయపడ్డాడు. రవితో ఫోన్‌లో ముచ్చటిస్తూ.. ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా కానీ నీ గేమ్ బాగుంటుంది. ఫైనల్‌లో కలుస్తానని చెప్పాడు.
తర్వాత సిరితో మాట్లాడుతూనే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పక్క తంతానంటూనే మరోపక్క నీ ఫైటింగ్ బాగుందని మెచ్చుకున్నాడు. తర్వాత కిస్సులు లేవా ? అని అడడగడంతో గాల్లోనే ముద్దులు పంపింది సిరి. చివర్లో వచ్చేవారమే బయటకు వచ్చేయకు, ఫైనల్‌దాకా అక్కడే ఉండమని చెప్పాడు. చివరిగా షణ్ముఖ్‌తో మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు జెస్సీ. ‘హౌస్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ. నేను ఎప్పటికీ నీ సీక్రెట్ ఫ్రెండ్‌నే’ అన్నాడు.
నువ్వు వెళుతూ మరొకరికి లైఫ్ ఇచ్చినందుకు ప్రౌడ్‌గా ఉందంటూ షణ్ను జెస్సీని పొగిడాడు. బయటకు వచ్చాక కలుద్దామని జెస్సీ అంటే.. నాతోనే ఉండాలి అని జెస్సీతో షన్ను అంటాడు.. నీతోనే ఉంటాను అని జెస్సీ అంటాడు.. వీరిద్దరి సంభాషణ విని విసుగొచ్చిన నాగ్ ఇక ఆపేయండి.. బాయ్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్‌లా మాట్లాడుకుంటున్నారు.. అని కౌంటర్ వేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…