Bigg Boss 5 : ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కప్పు కొట్టాలనే కసితో గేమ్ ఆడుతుంటారు. అయితే కొన్ని సందర్భాలలో వారి ఆరోగ్య పరిస్థితి బాగోలేక హౌజ్ నుండి బయటకు రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో గంగవ్వ, నోయల్ ఇలానే బయటకు వచ్చి తిరిగి లోపలికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు జస్వంత్ కూడా అనారోగ్యంతో బయటకు వచ్చేశాడు. జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ కొన్నిరోజులుగా వెర్టిగో అనే సమస్యతో బాధపడుతున్నాడు.
సమస్య పెద్దది కావడంతో బిగ్‌బాస్ అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపేసినట్లు టాక్. వెర్టిగో అంటే తల తిరగడం, చెమటలు పట్టడం, వాంతులు కావడం, వినికిడి లోపం, సరిగ్గా నిలుచోలేకపోవడం వంటి లక్షణాలుంటాయి. ఈ వెర్టిగో సమస్య వలన జస్వంత్ చాలా ఇబ్బంది పడడంతో అతనిని బయటకు పంపించేశారు. బిగ్‌బాస్ వద్దన్నా నువ్వు టాస్కుల్లో పాల్గొనడం గొప్ప విషయమంటూ నాగార్జున జెస్సీని అభినందించిన విషయం తెలిసిందే.
జస్వంత్ ని సీక్రెట్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్.. మీ ఆరోగ్యం విషయం వలన మీరు హౌజ్ నుండి బయటకు వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పడంతో జస్వంత్.. రూమ్ నుండి బయటికి వచ్చి హౌస్ నుండి వెళ్ళిపోతున్నట్లు తెలియజేశాడు. ఈ పరిణామం కంటెస్టెంట్స్ ని షాక్ కి గురిచేసింది. ముఖ్యంగా జస్వంత్ క్లోజ్ ఫ్రెండ్స్ సిరి, షణ్ముఖ్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్స్ లో కూడా జస్వంత్ లేడు. మరో రెండు వారాలు ఈజీగా అతను బిగ్ బాస్ హౌజ్‌లో ఉండేవాడు. కానీ అనారోగ్యం వలన అతను బయటకు రావడం అభిమానులని కలవరపరుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…