Bigg Boss 5 : రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారో చెప్పిన హౌజ్‌ మేట్స్‌.. అందరికీ అప్పులే ఉన్నాయిగా..!

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 చూస్తుండ‌గానే 12 వారాలు పూర్తి చేసుకుంది. ఇక కేవ‌లం మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో 7 గురు స‌భ్యులు ఉండ‌గా, వీరిలో విన్న‌ర్ ఎవ‌రు, టాప్ 5లో ఎవ‌రు ఉంటారు.. అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొని ఉంది. అయితే ఈ సారి బిగ్ బాస్ విజేత‌ల‌కు రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వ‌నున్న‌ట్టు నాగార్జున తెలిపారు. ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఆ డబ్బుతో ఎవరేం చేస్తారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు నాగ్‌.

మొదటగా ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను రూ.50 లక్షలు గెలుచుకుంటే తల్లిదండ్రుల కోసం ఇల్లు కొనిస్తా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరికగా ఉండేది. కానీ దత్తత తీసుకోవాలంటే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉండాలన్నారు. కాబట్టి ఈ ప్రైజ్‌మనీ గెలిస్తే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా’ అని చెప్పుకొచ్చింది.

శ్రీరామ్‌ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవ్వడానికే షోకు వచ్చాను. పెద్ద ఇల్లు కట్టి పేరెంట్స్‌తో కలిసి ఉండాలన్నది నా కోరిక’ అని చెప్పాడు. ‘కొంత వియా చదువు కోసం పొదుపు చేస్తా. నిర్మాణసంస్థను నెలకొల్పాలన్న కోరికను నెరవేర్చుకుంటా’ అని చెప్పాడు రవి.

ఇక కాజ‌ల్ మాట్లాడుతూ 30 లక్ష‌ల రూపాయ‌ల అప్పు ఉంది. అది తీర్చుకుంటా. అలాగే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ కట్టాలనుకుంటున్నాన‌ని చెప్పింది. సువర్ణ కుటీర్‌లో ఇల్లు కట్టుకుంటానంది. సన్నీ వచ్చిందంతా అమ్మకిచ్చేస్తానని, కొంత డబ్బు తీసుకుని సెలూన్‌ పెడతానన్నాడు. మానస్‌ తనకు వచ్చిన డబ్బుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేస్తానని చెప్పాడు.

షణ్ముఖ్‌.. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతున్న అమ్మకు రూ.25 లక్షలు ఇస్తానన్నాడు. తనకెన్నో సార్లు డబ్బు సాయం చేసి ఈ స్టేజ్‌ వరకు తీసుకొచ్చిన దీప్తి సునయనకు మరో రూ.25 లక్షలు ఇస్తానన్నాడు.

సిరి శ్రీహాన్‌ పేరెంట్స్‌కు ఉన్న రూ.10 లక్షల అప్పు తీర్చేసి కొంత అమ్మకిస్తానని, అలాగే అంధులకు సాయం చేస్తానని పేర్కొంది. ఇక మ‌ధ్య‌లో ఇంటి స‌భ్యుల‌తో బొమ్మ‌ల‌ను గుర్తు ప‌ట్టే ఆట‌ల‌తోపాటు బ్లైండ్ వీల్ చైర్ ఆట‌లు ఆడించాడు నాగార్జున‌. ఎలిమినేష‌న్ టైంలో హైడ్రామా న‌డిచింది. చివ‌ర‌కు ర‌వి, కాజ‌ల్ మిగ‌ల‌గా ఇందులో కాజ‌ల్ కోసం ఎవిక్ష‌న్ పాస్ ఉప‌యోగిస్తాడు స‌న్నీ. కానీ ఓటింగ్‌లో రవి చివరి స్థానంలో ఉండటంతో అతడు ఎలిమినేట్‌ అయ్యాడని నాగ్‌ ప్రకటించాడు.

స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్న రవి ఎలిమినేట్‌ అవడంతో ఏడుపాపుకోలేకపోయిన సన్నీ తన దగ్గరున్న గిఫ్ట్‌ వోచర్‌ను అతడికి బహుమతిగా ఇచ్చాడు. సన్నీ మాత్రమే కాదు, ఇంటిసభ్యులెవరూ రవి ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోయారు. స్టేజీ మీదకు వచ్చిన రవి చాలా తొందరగా బయటకు వచ్చేశానని బాధపడ్డాడు. అనంతరం ఈ బిగ్‌బాస్‌ జర్నీలో ఎవరు పాస్‌, ఎవరు ఫెయిల్‌ ? అనే గేమ్‌ ఆడాడు. షణ్ను పాస్‌ అయ్యాడని చెప్పడంతో అతడు లేచి ఏదైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు.

శ్రీరామ చంద్రలో అన్నీ పాజిటివ్‌ లే ఉన్నాయన్నాడు రవి. నువ్వు లోపలి నుంచి ఆడు, నేను బయట నుంచి ఆడతానని చెబుతూ అతడిని పాస్‌ చేశాడు. ఫ్రెండ్‌ కోసం ఏదైనా చేస్తాడు, తోపు అంటూ సన్నీని పాస్‌ చేశాడు. ప్రియాంక, సిరి, కాజల్‌కు ఫెయిల్‌ ట్యాగ్‌ ఇచ్చాడు. టాప్‌ 5లోకి రావాలని సిరిని ఎంకరేజ్‌ చేశాడు. మానస్‌ను చూసి చాలా నేర్చుకున్నా అని చెప్పుకొచ్చాడు ర‌వి. నిజంగా రవి ఎలిమినేష‌న్ అంద‌రికీ పెద్ద ట్విస్ట్‌గా మారింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM