Bigg Boss 5 : బుల్లితెర స్టార్ యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ 5లో సందడి చేసిన విషయం తెలిసిందే. టాప్ 5లో అతను తప్పక ఉంటాడనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. 12వ వారం హౌజ్ నుండి బయటకు వచ్చేశాడు రవి. అయితే ఊహించని ఎలిమినేషన్ కారణంగా అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. యాంకర్ రవి ఎలిమినేషన్ ను తట్టుకోలేకపోయిన అతని ఫ్యాన్స్.. బిగ్ బాస్‌లో రవికి అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు.
రవి లేకుంటే అసలు బిగ్ బాస్ ఎందుకు ? అంటూ మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రవిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని ఆందోళన కూడా చేపట్టారు. కానీ అవన్నీ ఇప్పుడు అసాధ్యాలు. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత రవి.. తొలిసారి తన ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చాడు. ఇందులో బిగ్ బాస్ షో గురించి.. మీమ్స్ రాయుళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటైతే.. బయటకు మరొకటి చూపిస్తున్నారని రవి అన్నాడు.
బిగ్ బాస్ ఇంట్లో కాకుండా.. బయట కూడా మరోలా ఉంటుందని.. వాళ్లు చూపించేదాన్ని బట్టి మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారని.. కంటెస్టెంట్స్ ను ప్రమోట్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారు. అది తప్పు అని నేను అనను.. కానీ నేను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు కూడా చెప్పాను. ట్రోల్స్, మీమ్స్ ఏవైనా ఉంటే నన్ను ఇష్టమొచ్చినట్లు వాడుకోండని చెప్పాను. కానీ.. అలా కాకుండా నా ఫ్యామిలీ జోలికి వచ్చారు. నా భార్య మీద.. నా కూతురి మీద కూడా ట్రోల్స్ చేశారు. దీనికి ఓ బ్యాచ్ ఉంది. వారిని ఏం అనాలో కూడా తెలియడం లేదు. వాళ్లకు ఓ రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్లింట్లో వాళ్లను కూడా ట్రోల్స్ చేస్తారు.. అంటూ రవి ఆవేదన వ్యక్తం చేశాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…