Bhimla Nayak : వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు అగ్రనటులు మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమాను 2022, జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ కూడా ప్రకటనను విడుదల చేసింది.
ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా షురూ చేశారు. కానీ రాజమౌళి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారో దాంతో లెక్కలు అన్నీ మారిపోయాయి. సర్కారు వారి పాట చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా లాలా భీమ్లా ప్రోమో రిలీజ్ ప్రకటన పోస్టర్ లో విడుదల తేదీగా జనవరి 12 ముద్రించారు. దీంతో సినిమా వాయిదా పడదని అనుకున్నారు.
కానీ తాజాగా దీపావళి విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రిలీజ్ డేట్ లేపేశారు. దీంతో అభిమానులలో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై అనుమానాలు నెలకొన్నాయి. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…