Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ శుభవార్త చెప్పారు. భీమ్లా నాయక్‌ను హిందీలోనూ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. పవన్, రానాలు కలిసి నటించిన ఈ మూవీ ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీని హిందీలోనూ విడుదల చేయనున్నట్లు నిర్మాత వంశీ తెలిపారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత వంశీ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ మూవీ సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. అందుకనే హిందీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయాలని అనుకున్నామని తెలిపారు. మళయాళ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌కు రీమేక్ అయినప్పటికీ ఆ మూవీ లోంచి కేవలం మెయిన్ స్టోరీని మాత్రమే తీసుకున్నామని.. సినిమాను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చామని తెలిపారు.
రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతంగా పనిచేశారని.. ఆయన సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారని.. అందువల్ల మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని వంశీ అన్నారు. ఇక ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్‌లు పవన్, రానాల సరసన నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా థమన్ మ్యూజిక్ అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ సినిమాను నిర్మించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదలవుతుందని అనుకుంటున్నారు. కానీ అవాంతరాలు ఎదురైతే విడుదలను ఏప్రిల్ 1కి వాయిదా వేస్తారని కూడా తెలుస్తోంది. మరి ఫిబ్రవరి 25 వరకు ఏమవుతుందో చూడాలి.