Bandla Ganesh : బండ్ల గణేష్ ఒకప్పుడు ఎంతో వార్తల్లో నిలిచారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా బయట కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక పోస్ట్ తప్ప ఆయన దర్శన భాగ్యమే కరువైపోయింది. అయితే తాజాగా ఈయన మరోమారు వార్తల్లో నిలిచారు. ఓ అభిమాని వేసిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో తాను గొంతు కోసుకుంటానని.. బండ్ల గణేష్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ ఆయన చెప్పిన పని మాత్రం చేయలేదు. దీంతో బండ్ల గణేష్‌ను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. బ్లేడ్ పట్టుకుని తిరుగుతూ.. బండ్ల గణేష్ ఎక్కడ.. అని చాలా మంది మీమ్స్ చేశారు.
అయితే ఆ ట్రోల్స్‌కు స్పందించిన బండ్ల గణేష్.. తనను వదిలేయాలని కోరారు. దీంతో ఆయనపై ట్రోల్స్ ఆగిపోయాయి. కానీ ఆయనపై తరచూ ఏదో ఒక విషయమై మీమ్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటికి ఆయన స్పందించరు. కానీ ట్విట్టర్‌లో పలువురు అభిమానులు అడిగే ప్రశ్నలకు మాత్రం ఆయన బదులిస్తుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన రిప్లై ఇచ్చారు.
బండ్ల అన్న.. మీరు అంటే నాకు చాలా అభిమానం.. మీరు బాగా మాట్లాడతారు. మీరు బీజేపీలో చేరితే బాగుంటుంది.. అని కోరాడు. దీంతో స్పందించిన బండ్ల గణేష్.. ప్లీజ్.. రాజకీయాలు మాట్లాడొద్దు.. అని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం రాజకీయాలు వదిలి సినిమాల నిర్మాణంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…