Balakrishna : నందమూరి బాలకృష్ణ అంటే ఫ్యాన్స్ ఆయనను ఎంతో అభిమానిస్తారు. ఆయన చూసేందుకు కోపిష్టిలా కనిపిస్తారు. అందువల్ల ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే ఎవరికైనా భయం వేస్తుంది. ఇక హీరోయిన్ల సంగతి సరేసరి. అందుకనే ఆయన తాజాగా చేస్తున్న ఎన్‌బీకే107 సినిమాలో ఆయన పక్కన నటించేందుకు శృతి హాసన్ భయపడింది. కానీ దర్శకుడు గోపీచంద్ మలినేని నచ్చజెప్పడంతో ఆమె ఎట్టకేలకు బాలయ్య పక్కన నటించేందుకు ఒప్పుకుంది. అయితే బాలకృష్ణ అన్ని సందర్భాల్లోనూ కోపంగా ఉండరు. కానీ ఆయనకు నచ్చని పనిచేస్తే మాత్రం ఎదుట ఎవరు ఉన్నా వారి చెంప పగులుతుంది. ఇలా గతంలో అనేక సార్లు జరిగింది. అయినప్పటికీ ఆయనతో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు.
ఇక తాజాగా తన నియోజకవర్గం అయిన హిందూపూర్‌లో ఓ కార్యకర్త ఇంటి గృహ ప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఆయనను చూసేందుకు ఫ్యాన్స్ అక్కడికి భారీగానే వచ్చారు. అయితే ఓ కార్యకర్త తన పాపతో కలిసి బాలయ్యతో ఫొటో దిగేందుకు ఆయన దగ్గరకు చేరుకున్నాడు. అయితే పాప అప్పటికే నిద్రపోతోంది. దీంతో బాలయ్య ఆ పాపను తట్టి లేపి.. లే.. ఫొటో దిగు.. అని గట్టిగా అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వేశారు. తరువాత ఫొటో తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పాప నిద్రలో ఉన్నప్పటికీ బాలయ్య గొంతు వినబడగానే ఠక్కున లేచి ఫొటోకు పోజు ఇచ్చింది. దీంతో బాలయ్యనా.. మజాకా.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య అంటే ఎవరైనా అలా భయపడాల్సిందేనని అంటున్నారు. ఫొటోలకు పోజులు ఇచ్చే విషయంలో తాను అసౌకర్యానికి గురైతే బాలయ్య ఇలాగే చేస్తారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అయితే ఇక్కడ పాప ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే తన అభిమాని చెంప మరోసారి చెళ్లుమనేది. అప్పుడు ఇంకా రాద్ధాంతం అయి ఉండేది. ఏది ఏమైనా.. ఫ్యాన్స్‌తో ఫొటోలు తీసుకోవడంలో బాలయ్య స్టైలే వేరని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…