Balakrishna : ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలోని దాదాపుగా 5900 ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్స్ లో విలీనం చేశారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఇంకా ఇతర కారణాలతోనే విలీనం చేయవలసి వచ్చిందని చెబుతోంది. అయితే నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దీనిపై మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు.
ఆయన ఈ మధ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజక వర్గానికి చెందిన కొట్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 30 ఎల్ఈడీ టీవీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల విలీనం రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుడు చర్యగా అభివర్ణించారు. దాని వల్ల విద్యార్థులు బడికి వెళ్లే దూరం ఎక్కువై రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ పాడైపోయాయని ప్రభుత్వం వాటిని బాగుచేయించకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. వివిధ రకాలుగా ప్రభుత్వం ప్రజలను బాదుడే బాదుడు చేస్తుందని, తాము కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అలాగే చేసి చూపిస్తామని వాఖ్యానించారు.
ఇక నందమూరి బాలకృష్ణ విద్యార్థులకు సలహా ఇస్తూ వారు సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండాలని సూచించారు. వారికి ఆనందించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కాబట్టి సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదని చెప్పారు. మనం ఏదైనా చేస్తే అది నాలెడ్జ్ ని పెంచే విధంగా ఉండాలని అన్నారు. అయితే హెరిటేజ్ గ్రూప్ వారు ఈ ఎల్ఈడీ టీవీలను అందించగా బాలకృష్ణ తన ఆర్గనైజేషన్ ద్వారా 4 లక్షల రూపాయలను ఈ స్కూల్ కి డొనేషన్ గా ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…